కరోనా వేళ పన్ను చెల్లింపుదారులకు కేంద్రం తీపి కబురు..!

కరోనా సమయంలో చాలా మందిపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడిన విషయం తెలిసిందే.ఈ సమయంలో ఎవరూ కూడా మునుపటిలాగా పనులు చేసుకోలేకపోయారు.

 Central Govt Good News For Tax Payers Good News To Tax Central Govt, Tax Inco-TeluguStop.com

దీంతో వివిధ ప్రభుత్వ శాఖలు సామాన్యులకు ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకుంటున్నాయి.ఈ నేపథ్యంలోనే కేంద్రం ఆధీనంలోని ఆదాయపు పన్ను శాఖ కూడా పన్ను చెల్లింపుదారులకు తీపి కబురు అందించింది.గతంలో డిసెంబర్ 31లోగా పన్ను చెల్లించాలని గడువు పెట్టగా ఇప్పుడా గడువును ఏకంగా 2.5 నెలల పాటు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.ఐటీఆర్ ఫైలింగ్ గడువును డిసెంబర్ 31 నుంచి మార్చి 15, 2022 వరకు పొడిగిస్తున్నట్లు తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.ఈ మేరకు ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ నోటిఫికేషన్ ను ఆదాయపన్ను శాఖ ట్విట్టర్ వేదికగా విడుదల చేసింది.

“కరోనా మహమ్మారి వల్ల పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్ ఫైలింగ్ విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.చాలామంది దీని గురించి మా దృష్టికి తీసుకొచ్చారు.వారు ఎదుర్కొంటున్న పరిస్థితులను పరిగణలోకి తీసుకొని అసెస్మెంట్ ఇయర్ 2021-22కు సంబంధించిన ఐటీఆర్, ఆడిట్ ఫైలింగ్స్ కి గడువు తేదీని మార్చి 15 వరకు పొడిగిస్తున్నాం.” అని ట్విట్టర్ వేదికగా ఇన్‌కమ్ టాక్స్ ఇండియా వెల్లడించింది.

Telugu Central, Latest, Ree Funds, Return, Tax-Latest News - Telugu

ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ కు మరో అవకాశం దక్కడంతో పన్ను చెల్లింపుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఆలస్యపు జరిమానాలు కట్టే బాధ తప్పిందని ఊపిరి పీల్చుకుంటున్నారు.ఇదిలా ఉండగా తాజాగా పన్ను చెల్లింపులకి సంబంధించిన గణాంకాలను ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది.గత ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది జనవరి 3 వరకు ఏకంగా 1 కోటి 48 లక్షల మందికి రూ.1 లక్షా 50 వేల 407 కోట్లకు పైగా రిఫండ్స్ విడుదల చేసినట్లు ఐటీ శాఖ తెలిపింది.రిఫండ్స్ ఈ స్థాయిలో ఉన్నాయంటేఇక వసూలైన పన్ను ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube