కిట్ కాట్ తో టొమోటోను కట్ చేసాడు.. ఈ వీడియో చూస్తే షాక్ అవుతారు!

సోషల్ మీడియా అంటేనే వింతలు వినోదాలకు పెట్టింది పేరు.రోజు ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది.

 Man Uses Kitkat As A Knife To Slice Tomato In Bizarre Viral Video Details, Man C-TeluguStop.com

నెటిజెన్స్ ఈ వీడియోలను చూసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు.తమకు నచ్చిన వీడియోలను లైక్ చేస్తూ, కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలోనే ఎక్కువుగా గడుపుతున్నారు.

కొన్ని వీడియోలు జ్ఞానం పెంపొందించే విధంగా ఉంటే మరికొన్ని వినోద భరితంగా ఉంటాయి.

తాజాగా వైరల్ అవుతున్న వీడియో చూస్తే మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.

ముందు ఈ వీడియోను చూస్తే ఆశ్చర్య పోవడం ఖాయం.అసలు ఇది ఎలా జరిగింది.

ఇలా కూడా జరుగుతుందా.అని మనం షాక్ అవ్వడం ఖాయం.

ఒక రెండు మూడు సార్లు చూస్తే కానీ ఈ వీడియో అర్ధం కాదు.ఇంతకీ అసలు ఆ వీడియోలో ఆశ్చర్య పోయే అంత ఏముందా అని ఆలోచిస్తున్నారా.

ఈ వీడియోలో ఒక వ్యక్తి కిట్ కాట్ తో టొమోటో ను ఈజీగా కట్ చేసి చూపించాడు.

చాకోలెట్ తో అసలు టొమోటో ను కట్ చేయడం ఎలా సాధ్యం అవుతుంది అని అనుకుంటున్నారా.అయితే ఈ వీడియో చూడాల్సిందే… అసలు ఈ వీడియోలో ఎం జరిగిందంటే.ఒక వ్యక్తి కత్తిని నూరినట్లు కిట్ క్యాట్ చాకోలెట్ అంచును పదును పెట్టి మరి టొమోటోను కట్ చేసి చూపించాడు.

దీనిని చూస్తే చాకోలెట్ లాగానే కనిపిస్తుంది.కానీ అది చాకోలెట్ మాత్రం కాదు.దానిని పదును పెట్టి చాలా షార్ప్ గా చేసాడు.ఈ టొమోటాను కట్ చేసిన వీడియో ప్రెజెంట్ నెట్టింట వైరల్ అవుతుంది.దీనిపై నెటిజెన్స్ వాళ్లకు నచ్చిన విధంగా ఫన్నీగా కామెంట్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.మీరు కూడా ఆ వీడియోను చూసి మీ స్పందనను కూడా తెలపండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube