యూజర్ ఫ్రెండ్లీ గా ' కూ ' యాప్..!

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాకు ఎంతగానో ప్రజాదరణ లభిస్తుంది.

మన చుట్టూ ఉన్నావారితో స్నేహం చేయడానికి, ప్రముఖుల గురించి తెలుసుకోవడానికి సోషల్ మీడియా అనేది ఒక ముఖ్యమైన వేదిక అని చెప్పవచ్చు.

అలాగే ప్రపంచంలో జరిగే వింతలు, విశేషాలను కూడా సోషల్ మీడియా ద్వారా తెలుసుకోవచ్చు.అయితే అలాంటి ఒక గొప్ప ఫ్లాట్ ఫార్మ్ ను చాలా మంది దుర్వినియోగం చేస్తున్నారు.

ఆర్థిక నేరాలు, గోప్యతకు భంగం కలిగించడం, డేటా చోరీ వంటి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు.అందుకే ఇలాంటి వాటి నుంచి తమ వినియోగదారులను కాపాడేందుకు కూ పటిష్టమైన చర్యలు చేపడుతోంది.

ఈ క్రమంలోనే సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించుకునేలా వినియోగదారులకు మేడ్ ఇన్ ఇండియా మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ కూ గురించి అవగాహన కల్పిస్తోంది.ఈ యాప్‌ వినియోగించే వారిలో ఎక్కువ మంది మొదటిసారి సోషల్ మీడియా వినియోగించేవారే.

Advertisement

దీంతో వారి భద్రత అనేది మరింత కీలకంగా మారింది.ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In), ఎలక్ట్రానిక్స్ & ఐటీ మంత్రిత్వ శాఖ (మైటీ), భారత ప్రభుత్వంతో ఇటీవల కూ యాప్ కొలాబరేట్ అయింది.

ఈ నెలను జాతీయ సైబర్ భద్రత అవగాహన కోసం కేటాయించారు.ముఖ్యంగా CERT-In, కూ యాప్ కలిసి వినియోగదారులకు ఫిషింగ్, పాస్‌వర్డ్ & ఏఎమ్‌పీ, హ్యాకింగ్, వ్యక్తిగత సమాచార భద్రత, , పిన్ మేనేజ్‌మెంట్, పబ్లిక్ వైఫైను వినియోగించేటప్పుడు గోప్యత వంటి విషయాలపై ప్రజలలో అవగాహన కల్పిస్తున్నాయి.

ముఖ్యంగా సోషల్ మీడియాలో ఏమైనా కంటెంట్ ఫేక్ అని తెలిస్తే మాత్రం ఫ్లేగ్ చేయాలని కూ సూచిస్తోంది అన్నమాట.ఇలా చేసినవారికి రివార్డులతో సత్కరించనున్నారు.రివార్డులకు ఆశపడి ఎవరయినా ఫేక్ కాని కంటెంట్ ను ఫ్లేగ్ చేస్తే వారికి పెనాల్టీ కూడా ఉంటుందట.

ఇందుకోసం ఓ సలహా బోర్డ్‌ను కూడా ఏర్పాటు చేయనుంది.అలాగే అన్ని భాషల యూజర్లకు సెక్యూర్ వేదికను ఇవ్వడమే లక్ష్యంగా కూ పనిచేస్తోంది.2020 మార్చిలో ప్రారంభమైన కూ యాప్ ఇప్పటికే 1.5 కోట్ల డౌన్‌లోడ్‌లతో దూసుకుపోతోంది.ఇప్పటికే 9 దేశీయ భాషల్లో ఇది అందుబాటులో ఉంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

రాజకీయ, క్రీడా, సినీ, మీడియా ఇలా అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు కూ యాప్‌ను వినియోగిస్తున్నారు.వచ్చే ఏడాది ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు