టీడీపీ నాయకులపై నమోదైన కేసుల విషయంలో పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం పార్టీ నాయకులపై దాడులు జరగటం మాత్రమేకాక అక్రమ కేసులు పెడుతున్నట్లు టీడీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు.పోలీసులను అడ్డం పెట్టుకుని అధికార పార్టీ నాయకులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని.

 High Court News Orders To Police Department On Tdp Leaders Cases Tdp, High Court-TeluguStop.com

చాలా సందర్భాలలో చంద్రబాబు ఇంకా కీలక తెలుగుదేశం పార్టీ నేతలు మీడియా సుముఖంగా తెలపటం తెలిసిందే.ఇటువంటి తరుణంలో ఏపీ హైకోర్టు తాజాగా తెలుగుదేశం పార్టీ నాయకులపై నమోదైన కేసుల విషయంలో… పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

విషయంలోకి వెళితే తెలుగుదేశం పార్టీ నాయకుల పై నమోదైన కేసులు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని… హైకోర్టు ఆదేశించడం జరిగింది.

Telugu Ap, Ayyanapatrudu, Bhuvaneswari, Tdp, Vanga Anitha, Ysrcp-Telugu Politica

ఇదే సమయంలో తమపై నమోదైన కేసులను కొట్టివేయాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మరియు వంగలపూడి అనిత ఇంకా కొంతమంది కీలక నాయకులు ఇటీవల హైకోర్టును ఆశ్రయించడం జరిగింది.ఈ క్రమంలో విచారించిన జస్టిస్ సిహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ నేతృత్వంలోని ధర్మాసనం పోలీసుల కు.టీడీపీ నేతల పై నమోదైన కేసులో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేయడం జరిగింది.అంత మాత్రమే కాక సి ఆర్ పి సి 41ఎ కింద ముందుగా నోటీసులిచ్చి వివరణలు తీసుకోవాలని, అరెస్టు విషయంలో తొందరపాటు చర్యలు తీసుకోకూడదని స్పష్టం చేయడం జరిగింది.

ఇటీవల చంద్రబాబు భార్య భువనేశ్వరి విషయంలో.

అధికార పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా తెలుగుదేశం పార్టీ నేతలు ఆందోళన నిర్వహించారు ఈ క్రమంలో పోలీసులతో వాగ్వాదానికి దిగటంతో నర్సీపట్నం ఎస్సై లక్ష్మణ్ రావు.తమ విధులకు ఆటంకం కలిగించారని పోలీసు వ్యవస్థ కి భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో.

అయ్యన్నపాత్రుడు మరికొంత మంది తెలుగుదేశం పార్టీ నేతలు.హైకోర్టును ఆశ్రయించడంతో.కోర్టు పై రీతిలో ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube