తెలంగాణలో బిజెపిని( BJP ) అధికారంలోకి తీసుకురావాలనే పట్టుదలతో బిజెపి అధిష్టానం ఉంది.ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ అంతా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య అన్నట్లుగా ఉండడంతో , ఢిల్లీ అధిష్టానం ఆ పరిస్థితిని మార్చేందుకు రంగంలోకి దిగింది ఇప్పటికే భారీ బహిరంగ సభల్లో ప్రధాని నరేంద్ర మోడీ( Prime Minister Narendra Modi ) వచ్చి పాల్గొంటున్నారు.
ఇక వరుసగా బిజెపికి చెందిన కీలక నేతలంతా తెలంగాణకు క్యూ కట్టేందుకు సిద్ధమవుతున్నారు.ఈనెల 28 సాయంత్రం ఐదు గంటలకు ఎన్నికల ప్రచారం ముగియనున్న నేపథ్యంలో, ఎనిమిది రోజులే కీలకంగా భావిస్తున్నారు.
అందుకే జిల్లాలు, నియోజకవర్గాల వారీగా బిజెపికి చెందిన కీలక నేతలంతా ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.ఇప్పటికే వరుసగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా( Amit Shah ) , బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా( JP Nadda ) వంటి వారు రోజు విడిచి రోజు తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు.
తెలంగాణలో బిజెపి తప్పకుండా అధికారంలోకి వస్తుందనే నమ్మకంతో ఉన్నారు.దీనిలో భాగంగానే ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉదృతం చేసేందుకు నిర్ణయించుకున్నారు.దీనిలో భాగంగానే ఈనెల 25, 26, 27 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోది వివిధ నియోజకవర్గాల పరిధిలో విస్తృతంగా పర్యటనలు రోడ్డు షోలు నిర్వహించేందుకు ప్లాన్ చేసుకున్నారు.27న హైదరాబాద్ లో ప్రధాని మోదీ రోడ్ షో నిర్వహించనున్నారు .మొత్తం ఆరు బహిరంగ సభల్లో ఆయన పాల్గొనబోతున్నారు.ఇక ఈరోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్( Finance Minister Nirmala Sitharaman ) జూబ్లీహిల్స్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర పడ్నవీస్ ( Deputy CM Devendra Padnavis )ముషీరాబాద్ నియోజకవర్గాల పరిధిలో పర్యటించనున్నారు .
బిజెపి జాతియ అధ్యక్షుడు ఈనెల 23న ముతోల్, సంగారెడ్డి, నిజామాబాద్ అర్బన్ లో సభలకు హాజరు కావడంతో పాటు , హైదరాబాద్ లో రోడ్ షో నిర్వహించనున్నారు.25, 26 ,27 తేదీలలో కూడా వివిధ జిల్లాల్లో నిర్వహించే రోడ్ షో లు, సభలు సమావేశాల్లో వీరు పాల్గొంటారు.అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈనెల 24 ,25, 26 తేదీలలో 10 బహిరంగ సభల్లో పాల్గొంటారు.ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలతో పాటు, హైదరాబాద్ లోనూ ఆయన రోడ్ షో నిర్వహించనున్నారు.