అల్లు అర్జున్ సుకుమార్ ల కాంబోలో రూపొందిన పుష్ప ట్రైలర్ నేడు సాయంత్రం ఆరు గంటలకు విడుదల అవ్వాల్సి ఉంది.కాని టెక్నికల్ ఇష్యూస్ కారణంగా ట్రైలర్ ను వాయిదా వేస్తున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.
నేడే విడుదల అవ్వబోతుందా.లేదంటే ట్రైలర్ కు ఇంకాస్త సమయం పడుతుందా అనేది తెలియదు.
పుష్ప ట్రైలర్ ను థియేటర్ లో స్క్రీనింగ్ చేయడం కోసం మెయిన్ పట్టణాల్లోని కొన్ని థియేటర్ల వద్ద అభిమానులు హడావుడి చేశారు.పెద్ద ఎత్తున ప్లెక్సీలు ఏర్పాటు చేసి పోస్టర్ లు పెట్టి అలంకరించి ఆరు కోసం ఎదురు చూస్తున్న వీడియో లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వచ్చాయి.
ఇప్పుడు ఆ ట్రైలర్ ను విడుదల చేయక పోవడంతో అభిమానులు ఉసూరుమంటున్నారు.విడుదలకు 10 రోజుల ముందుగానే అల్లు అభిమానులు థియేటర్ల వద్ద హడావుడి మొదలు పెట్టడంతో అంతా కూడా ఫుల్ జోష్ గా కనిపిస్తున్నారు.

ఈ సమయంలో అల్లు అర్జున్ అభిమానుల ఉత్సాహంను నీరు గార్చే విధంగా ట్రైలర్ విడుదల ఆలస్యం అంటూ ప్రకటించడం జరిగింది.కొన్ని ఏరియాల్లో కాస్త ఆలస్యం అయినా పర్వాలేదు కాని సినిమా ట్రైలర్ వచ్చే వరకు వెయిట్ చేస్తామంటూ అభిమానులు థియేటర్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు.రాత్రి 9 గంటల లోపు వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కొందరు చెబుతున్నారు.ట్రైలర్ ఫైనల్ ఎడిట్ లో చిన్న మార్పు చేయడం వల్ల విడుదలకు సంబంధించి ఆలస్యం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
మొత్తానికి అల్లు అర్జున్ అభిమానులు కాస్త నిరుత్సాహం వ్యక్తం చేసినా ముందు ముందు అంటే సినిమా విడుదల అయిన తర్వాత అద్బుతాన్ని ఆవిష్కరించబోతున్నట్లుగా నమ్మకం గా ఉన్నారు.బన్నీ కి జోడీగా రష్మిక మందన్నా నటించగా సమంత ఐటెం సాంగ్ ను చేసిన విషయం తెల్సిందే.
ట్రైలర్ లో సమంత లుక్ ను కూడా రివీల్ చేస్తారేమో చూడాలి.