ఆ సీఎం తన జీవితం లో చుసిన ఏకైక సినిమా నాగార్జున చిత్రం.. ఏంటది ?

రాజకీయ నాయకులు చాలా బిజీగా ఉంటారు.నిత్యం జనాల్లో కలిసిపోతారు.

 Nadendla Bhaskar Watched Only One Movie Of Nagarjuna , Nadendla Bhaskar , Nagar-TeluguStop.com

తమ తమ పదవులను కాపాడుకునే ప్రయత్నం చేస్తారు.మిగతా యాక్టివిటీస్ కు దూరంగా ఉంటారు.

అంటే సినిమాలు చూడ్డం, షికార్లకు వెళ్లడం చాలా అంటే చాలా తక్కువగా ఉంటాయి.ఎంజాయ్ చేయాలనే ఆలోచనే ఉండదు.

ఉన్నా సమయం కుదరదు.ఎమ్మెల్యేలు, మంత్రుల పరిస్థితే ఇలా ఉంటే.

ముఖ్యమంత్రి పరిస్థితి గురించి చెప్పాల్సిన అవసరం లేదు.నిత్యం అధికారులు, మంత్రులతో సమావేశాలు, ఆయా అంశాలపై నిర్ణయాలు, ఇంకా ఎన్నో రివ్యూలతో బిజీ బిజీగా ఉంటారు.

సేమ్ ఇలాంటి పరిస్థితులే ఎదుర్కొన్నాడు ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నాదేండ్ల భాస్కర్ రావు.సినిమాలు చూసే సమయం తనకు ఉండేది కాదన్నాడు.కానీ ఓసారి ఓ సినిమా చూసినట్లు వెల్లడించాడు.ఇంతకీ అది ఏ సినిమానో.చూసేందుకు ఎలా సమయం దొరికిందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

నిజానికి తనకు సినిమాల పట్ల అంతగా ఆసక్తి ఉండదని చెప్పాడు నాదెండ్ల.

కానీ.ఒకే ఒక్కసారి నాగార్జున హీరోగా నటించిన అన్నమయ్య సినిమాను మాత్రం చూశానని చెప్పాడు.

ఈ సినిమాలో పాటలతో పాటు నాగార్జున నటన కూడా తనకు బాగా నచ్చిందని చెప్పాడు.

Telugu Annamayya, Nadendlabhaskar, Nagarjuna, Raghavendra Rao, Suman-Latest News

తన జీవితంలో చూసిన తొలి సినిమా అది అని వెల్లడించాడు.దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించాడు ఈ సినిమా.శ్రీ వేంకటేశ్వరుడి భక్తడు తాళ్లపాక అన్నమాచార్య జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.

Telugu Annamayya, Nadendlabhaskar, Nagarjuna, Raghavendra Rao, Suman-Latest News

అటు తెగులు సినిమా పరిశ్రమలో దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వర్ రావుతో భాస్కర్ రావుకు మంచి మిత్రత్వం ఉండేది.వాళ్లిద్దరి ఇండ్లు పక్కపక్కనే ఉండేవి.నాగేశ్వర్ రావు ప్రీగా ఉన్నప్పుడు భాస్కర్ రావు ఇంటికి వెళ్లేవవాడు.ఆయా విషయాల గురించి మాట్లాడేవాడు.ఆయనతో తనకు ఉన్న సాన్నిహిత్యం మూలంగానే అన్నమయ్య సినిమా చూడాలని నాగేశ్వర్ రావు చెప్పినట్లు వెల్లడించాడు.అందుకే ఆ సినిమా చూశానన్నాడు.

అయితే ఈ సినిమా తనకు ఎంతో బాగా నచ్చిందన్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube