బిగ్ బాస్ సీజన్ 5 ఎనిమిదవ వారం ఆరుగురు హౌజ్ మెట్స్ నామినేషన్స్ లో ఉన్నట్టు తెలుస్తుంది.ఈ ఆరుగురిలో అందరు దాదాపు స్ట్రాంగ్ కంటెస్టంట్స్ అవడంతో ఒకరిద్దరికి ఈవారం రిస్క్ అని చెప్పొచ్చు.
ఈ వారం నామినేషన్స్ లో రవి, శ్రీరాం చంద్ర, మానస్, షణ్ముఖ్, లోబో, సిరి ఉన్నారని తెలుస్తుంది.వీరిలో ఈ వారం రిస్క్ ఉన్నది లోబోకి మాత్రమే అని అంటున్నారు.
బిగ్ బాస్ సీజన్ 5లో ఇప్పటివరకు గడిచిన ఆట ప్రకారం లోబో తన ఆట తను ఆడుకుంటూ వస్తున్నాడు.అయితే లాస్ట్ వీక్ సీక్రెట్ రూం లో ఉండి వారం మొత్తం ఆట ఆడలేదు.
అందుకే ఈ వారం అతను ఏదైనా టాస్కులు బాగా ఆడి ఆడియెన్స్ మెప్పు పొందితే తప్ప ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.ఇక మరోపక్క నామినేషన్స్ లో ఉన్న మిగతా ఐదుగురిలో కూడా అందరు స్ట్రాంగ్ అని అనిపిస్తున్నా ఓట్స్ చీలితే మాత్రం ఎవరైనా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
మరి నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యేది ఎవరో చూడాలి. బిగ్ బాస్ షాక్ ఇస్తూ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ పెట్టినా పెట్టొచ్చని అంటున్నారు.