కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా తగ్గుముఖం పట్టిందని, భవిష్యత్తులో ఎలాంటి కరోనా వేరియంట్స్ వచ్చినా వాటి ప్రభావ తీవ్రత పెద్దగా ఉండదని నిపుణులు ఒక పక్క చెబుతుంటే మరో పక్క బ్రిటన్ , రష్యా , అమెరికా లలో కరోన మహమ్మారి విరుచుకుపడుతోంది.గడిచిన కొన్ని రోజులుగా ఆయా దేశాలలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరగడంతో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఏ దేశాల నుంచీ భారత్ వచ్చే వారు విదేశీయులు, ఎన్నారైలు ఎవరైనా సరే తప్పనిసరిగా ఇక్కడ కరోనా నిభందనలు పాటించిన తరువాతనే భారత్ లోకి అడుగు పెట్టే అవకాశం ఉంటుందని ప్రకటించింది.
భారత్ లోకి వచ్చే ప్రయాణీకులు ఎవరైనా సరే ఆర్టీపీసిఆర్ నెగిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలని కీలక సూచన చేసింది.
కరోనా తమకు లేదనే సర్టిఫికెట్ గనుకా లేకపోతే భారత్ లో ప్రవేశించేందుకు అనుమతులు లేవని స్పష్టం చేసింది.ప్రతీ ప్రయాణీకుడు తప్పనిసరిగా ఆరోగ్య మంత్రిత్వశాఖ సెల్ఫ్ డిక్లరేషన్ ఫారమ్ పూర్తి చేసి ప్రయాణం చేసే ముందు https://www.newdelhiairport.in/ లింక్ ఓపెన్ చేసి ఆన్లైన్ సువిద లో పూర్తి చేయబడిన సెల్ఫ్ డిక్లరేషన్ ఫారమ్ ను అప్లోడ్ చేయాలి.అంతేకాదు ప్రయాణానికి 72 గంటల ముందు తీసుకున్న కోవిడ్ టెస్ట్ రిపోర్ట్ ను కూడా అప్లోడ్ చేయాలని సూచించింది కేంద్రం.
ఇదిలాఉంటే భారత్ విధించిన ఆంక్షలు పాటించని వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, క్రిమినల్ ప్రాసిక్యూట్ కు భాద్యులు అవుతారని హెచ్చరించింది.
అయితే A కేటగిరి దేశాల నుంచీ వచ్చే వారు తప్పనిసరిగా వారు తీసుకున్న వ్యాక్సిన్ తాలూకు సర్టిఫికెట్ ను పోర్టల్ లో అప్లోడ్ చేయాలని, ప్రతీ ఒక్క ప్రయాణీకుడు వారి మొబైల్ లో ఆరోగ్య సేతు యాప్ ను అప్లోడ్ చేయాలని సూచించింది.ఈ సూచనలు పాటించిన వారికి మాత్రమే విమానయాన సంస్థలు భారత్ లోకి వచ్చేందుకు అనుమతులు ఇస్తాయని అందుకే భారత్ రావాలనుకునే వారు తప్పనిసరిగా తాము సూచించిన నిభందనలు అన్నీ పూర్తి చేయాలని కేంద్రం ప్రకటించింది.
.