హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో.పోసాని కృష్ణ మురళి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు అటు ఇండస్ట్రీ పరంగా ఇటు రాజకీయ పరంగా పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి.
పవన్ ని దారుణంగా విమర్శించడంతో పంజాగుట్ట పిఎస్ లో పవన్ ఫ్యాన్స్ పోసాని పై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కంప్లైంట్ నమోదు చేశారు.ఇదే తరుణంలో పోసాని కృష్ణమురళి ఈరోజు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పవన్ కళ్యాణ్ అభిమానుల నుండి తనకు ప్రాణహాని ఉందని.
ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం.
ఈ విధంగా పవన్ అభిమానులు అదేవిధంగా పోసాని కృష్ణమురళి ఒకరిపై మరొకరు కంప్లైంట్ చేసుకుంటూ ఉండటంతో.రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.ఇదే సమయంలో పవన్ ఏపీలో మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలో.
నేతలతో సమావేశం కావడంతో పోసాని కృష్ణ మురళి వ్యాఖ్యలపై పవన్ ఏ విధంగా స్పందిస్తారు అన్నది సస్పెన్స్ గా నెలకొంది.పోసాని నిన్న సాయంత్రం తన ఇంటి ఆడవాళ్ళ పై పవన్ అభిమానులు.
ఇష్టానుసారంగా మెసేజ్ లు ఫోన్ లోకి పెడుతూ, అసభ్యకరమైన పదజాలంతో ఫోన్ చేస్తూ మాట్లాడుతున్నారని పోసాని పవన్ కళ్యాణ్ పై కుటుంబ సభ్యుల పై తీవ్ర కామెంట్లు చేయడం జరిగింది.
దీంతో ప్రెస్ క్లబ్ బయట పోసాని పై దాడికి కూడా పవన్ అభిమానులు పాల్పడటం మీడియాలో వీడియోలు బయటకు వచ్చాయి.
ఈ క్రమంలో పవన్ ఫ్యాన్స్ పోసాని పై, పోసాని.పవన్ కళ్యాణ్ అభిమానుల పై.కంప్లైంట్ చేస్తూ ఉండటంతో పోలీసులు ఎవరిపై చర్యలు తీసుకుంటారన్నది చర్చనీయాంశంగా మారింది.