ముస్లీములు ఉండండి ....కానీ వదిలేయండి

ఇక్కడే అంటే దేశంలో అని అర్థం.వదిలేయండి అంటే ఆవు మాంసం తినడం వదిలేయాలని అర్థం.

 Muslims Can Stay But Must Give Up Beef-TeluguStop.com

ఎవరు వదిలేయాలి? ముస్లీములు.ముస్లీములు దేశంలో ఉండొచ్చు.

కానీ బీఫ్ వదిలేయాలని హర్యానా ముఖ్యమంత్రి ఎమ్మెల్ ఖట్టార్ అన్నారు.ఈయన భాజపా ముఖ్యమంత్రి.

కరడు గట్టిన ఆరెసెస్ నాయకుడు.గోవును హిందువులు పవిత్రంగా భావిస్తారని, కాబట్టి దీన్ని తినకూడదని ఖత్తర్ అన్నారు .యూపీలోని దాద్రీలో ఆవు మాంసం తిన్నాడనే కారణంతో ముస్లీమును చంపిన ఘటనపై ఖత్తర్ విచారం వ్యక్తం చేయలేదు.అవగాహన లోపంతో ఆ ఘటన జరిగిందని అన్నారు.

రెండు వర్గాల వారి తప్పు ఉందన్నారు.అంటే ముస్లీము ఆవు మాంసం తినడం తప్పు అని, మరో వర్గం వారు తొందర పది చంపడం తప్పు అని రెండు వైపులా తప్పు తేల్చారు.

కానీ చివరకు ముస్లీములు బీఫ్ తినకూడదని ఖరాఖండిగా చెప్పారు.బీఫ్ వివాదం ఇప్పటిలో టెలి విధంగా కనబడటం లేదు.

ప్రతీ నాయకుడు ఈ వివాదాన్ని సాగదీస్తూ తన వంతుగా ఆజ్యం పోస్తున్నాడు.హిందువుల్లో కొన్ని కులాల వారు ఆవు మాంసం తింటారని, అలాంటప్పుడు ముస్లీములు తింటే తప్పు ఏమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు.

ఎవరికీ నచ్చిన ఆహారం వారు తింటారని, దీన్ని వివాదం చేయడం ఎందుకని అడుగుతున్నారు.భాజపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హిందూ, ముస్లీముల మధ్య ద్వేషాన్ని పెంచే విధంగా నాయకులు వ్యవహరిస్తున్నారని లౌకిక వాదులు విమర్శిస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో గెలవడం కోసం భాజపా ఇప్పటి నుంచే ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నదని అనిపిస్తున్నది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube