బుల్లితెర రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ షో సీజన్5 కంటెస్టెంట్ల రెమ్యునరేషన్ గురించి బిగ్ బాస్ అభిమానుల మధ్య చర్చ జరుగుతోంది.ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్ల రెమ్యునరేషన్లకు సంబంధించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
బిగ్ బాస్ సీజన్ 5లో ఎక్కువ రెమ్యునరేషన్ కంటెస్టెంట్ రవికి ఇస్తున్నారని ఈయన రెమ్యునరేషన్ ఏకంగా 3 నుంచి 4 లక్షల రూపాయలు అని సమాచారం.
ప్రముఖ కొరియోగ్రాఫర్ యానీ మాస్టర్ కూడా వారానికి 3 లక్షల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటున్నారని తెలుస్తోంది.
యాంకర్ లోబోకు ప్రేక్షకులకు బాగానే గుర్తింపు ఉండటం, ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ బాగానే అందిస్తున్న నేపథ్యంలో వారానికి 3 లక్షల రూపాయలకు అటూఇటుగా పారితోషికం ఇస్తున్నారని సమాచారం.స్టార్ సింగర్ శ్రీరామచంద్రకు వారానికి రెండు లక్షల రూపాయల పారితోషికం దక్కినట్టు సమాచారం.
ప్రముఖ సినీ నటి ప్రియకు కూడా వారానికి రెండు లక్షల రూపాయల చొప్పున పారితోషికం ఇస్తున్నారని తెలుస్తోంది.

మోడల్ జెస్సీ కూడా ఇదే మొత్తాన్ని ఛార్జ్ చేస్తున్నట్టు సమాచారం.నటి లహరి షారాకు మాత్రం వారానికి లక్ష రూపాయల నుంచి రెండు లక్షల రూపాయలు పారితోషికంగా ఇస్తున్నారని తెలుస్తోంది.నటుడు విశ్వ, నటరాజ్ మాస్టర్, ప్రియాంక సింగ్ వారానికి 60,000 రూపాయల చొప్పున తీసుకుంటున్నారని సమాచారం.

వీజే సన్నీ, సిరి హన్మంత్, శ్వేతా వర్మలకు కూడా వారానికి 60,000 రూపాయల చొప్పున ఇస్తున్నారని తెలుస్తోంది.షణ్ముఖ్ జశ్వంత్ కు వారానికి 3 నుంచి 4 లక్షల రూపాయల వరకు అని తెలుస్తోంది.బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన సరయుకు వారానికి 70,000 రూపాయలు ఉమాదేవికి వారానికి 80,000 రూపాయల చొప్పున ఇచ్చారని సమాచారం.బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జునకు మాత్రం 9 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ గా ఇచ్చారని తెలుస్తోంది.
బిగ్ బాస్ నిర్వాహకులు కంటెస్టెంట్లకు భారీగానే రెమ్యునరేషన్ ఇస్తుండటం గమనార్హం.