ఒకప్పుడు ఆడవాళ్లు ఎంతో సంప్రదాయమైన దుస్తులలో కనిపించేవారు.ఇంట్లో వారి వేషధారణ ఎలా ఉన్నా పర్వాలేదు కానీ బయటకు వచ్చినప్పుడు మాత్రం కాస్త పద్దతిగా ఉంటే బాగుంటుంది కదా.
కానీ కొంతమంది ఆడవాళ్లు మాత్రం తమకేమి పట్టనట్లు బహిరంగంగానే ఒంటి మీద సరైన బట్టలు లేకుండా తిరిగేస్తున్నారు.అయితే ఇలా అందరు ఆడవాళ్లు తిరుగుతున్నారని మేము అనడంలో లేదు.
ఇలా ఎందుకు ఇప్పుడు ఆడవాళ్ళ బట్టలు గురించి చెబుతూన్నామంటే.ఒక మహిళ ఏకంగా సిగ్గు ఎగ్గు లేకుండా బికినీ ధరించి మయామి ఎయిర్ పోర్ట్ కి వచ్చేసింది.
సదరు మహిళకు సంబందించిన ఎయిర్ పోర్ట్ లో బికినీ మహిళ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడంతో పాటు ఈ వీడియో చూసి నెటిజన్లు అవాక్ అవుతున్నారు.ఇలా బికినిలో కూడా విమానాశ్రయానికి రావచ్చా అని ఆశ్చర్య పోతున్నారు.
ఈ షాకింగ్ ఘటన మయామి ఎయిర్ పోర్ట్ లో చోటు చేసుకుంది.
ఇదిలా ఉండగా ఈ వీడియోలో కనిపించే మహిళ ముఖానికి మాస్క్ ధరించడం వలన ఎవరో ఏంటో అనే వివరాలు తెలియలేదు.
ఒక నాజూకైన అమ్మాయి ఆలివ్ గ్రీన్ బికినీ ధరించి ముఖానికి మాస్క్ పెట్టుకుని సెక్యూరిటీ ద్వారా లోపలికి ప్రవేశిస్తున్నట్లు మనం వీడియోలో చూడవచ్చు.ఈ మహిళను ఆరాగా చూస్తే ఎక్కడో మధ్యాహ్నం ఏదో ఒక ఫంక్షన్ కి వెళ్లొ లేక ఏదన్నా పార్టీ చేసుకొని ఎంజాయ్ చేసి విమానం వెళ్ళిపోతుందనే కంగారులో ఒంటి మీద ఎలాంటి డ్రెస్ ఉందనే విషయం కూడా మరిచిపోయి హుటాహుటిన ఎయిర్ పోర్ట్ కి పరుగెత్తుకొచ్చిందని తెలుస్తుంది.
బికినీ అయితే వేసింది కానీ కరోనా రూల్స్ మాత్రం బ్రేక్ చేయలేదండోయ్.మాస్క్ మాత్రం ధరించే విమానాశ్రయంలోకి అడుగుపెట్టింది.అ బికినీ మహిళకు సంబందించిన వీడియోను సోషల్ మీడియాలో ఎవరో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ అయింది.

కాగా కొన్ని కొన్ని ఎయిర్ పోర్ట్స్ లో అయితే ప్రయాణికుల దుస్తుల విషయంలో కూడా ఆంక్షలు ఉంటాయి.వాటికి అనుకూలంగా డ్రెస్ సెన్స్ ఉండాలి.లేదంటే విమానం నుంచి బయటకు పంపే సందర్భాలు చాలానే మనం చూసి ఉన్నాము.
మరి ఈ గుర్తు తెలియని లేడీ మాత్రం ఎలా విమానాశ్రయంలోకి బికినీ వేసుకుని వెళ్లిందో అర్ధం కావట్లేదు.ఏది ఎలా ఉన్నా ప్రస్తుతం ఈ యువతి బికినీ వీడియో చుసిన ప్రతి ఒక్కరు తమదైన శైలిలో కామెంట్స్ పెడుతున్నారు.
విమానంలో పాప చాలా హాట్ గా ఉందని ఒకరు అంటే., విమానంలోకి అ బికినీ యువతిని అనుమతించరని మరొకరు కామెంట్స్ పెడుతున్నారు.