నేషనల్ ఎలిజిబిలిటి కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్ ) విషయంలో ఎన్నారైలకు కేంద్రానికి మధ్య గందరగోళం నెలకొంది.నీట్ పరీక్షల్లో ఎన్నారై కోటాలకు అప్ప్లై చేసుకున్న వారు మిగిలిన కోటాలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు కాదని నేషనల్ టెస్ట్ ఏజెన్సీ అలాగే కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ కలిసి కొన్ని మార్పులు చేర్పులు చేశాయి.
దాంతో ఎన్నారై కోటాలో నీట్ కు దరఖాస్తు చేసుకునే వారు మరే ఇతర ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఇలా ఏ ఇతర కోటాలో కూడా దరఖాస్తు చేయడానికి అర్హులు కాదని తేల్చింది.అంతేకాదు ఒక వేళ ఎస్సీ, ఎస్టీ, ఓబీసి రిజర్వేషన్లలో దరఖాస్తు చేసుకున్న వారిలో ఎన్నారైలు ఉంటె వారికి ఎన్నారై కోటా వర్తించదని తేల్చి చెప్పింది.
దాంతో ఒక్కసారిగా ఎన్నారైలు ఆందోళన వ్యక్తం చేశారు.
రాజ్యాంగం ఇచ్చిన హక్కును ఎలా కుదరదని చెప్తారని, రెండు అవకాశాలు వినియోగించుకోవడం తమ హక్కు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నారై కోటాకు, రిజర్వేషన్ కు ముడి పెట్టవద్దని అంటున్నారు.అయితే ఈ విషయంపై వివాదం నడుస్తున్న సమయంలోనే కేరళా కు చెందిన ఓ ఎన్నారై విద్యార్ధి కోర్టును ఆశ్రయించాడు.
తాను ఓ ఎన్నారై నని అయితే అప్లికేషన్ లో తను ఎన్నారై ఆప్షన్ ఎంచుకోగా తన ఓబీసి ఆప్క్షన్ కనిపించిన కుండా పోయిందని, కేవలం జనరల్ మాత్రమే కనిపిస్తుందని కోర్టును ఆశ్రయించాడు.తనకు ఎన్నారై కోటాతో పాటుగా ఓబీసీ కోటా కూడా కల్పించాలని అప్పీలు చేశారు.
అయితే ఈ విషయంపై నేషనల్ టెస్ట్ ఏజెన్సీ కూడా ఘాటుగా స్పందించింది.ఒక్క సారి ఎన్నారై కోటాను వినియోగించుకున్న వారికి మరొక కోటా వినియోగించుకునే హక్కు ఎలా వస్తుందని తమ వాదనలు వినిపించింది.
ఏదో ఒక కోటాలో హక్కును వినియోగించుకోవాలని, ఇది విద్యార్ధులను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నామని ఇలా రెండు కోటాలో వినియోగించుకుంటే ఇక్కడ ఉండే విద్యార్ధులకు నష్టం కలుగుతుందని, రెండవ కోటాకు అనుమతి ఇచ్చేంది లేదని తేల్చి చెప్పింది.
కానీ కోర్టు తీర్పు ఎన్నారై విద్యార్ధికి అనుకూలంగా వచ్చింది.
అయినప్పటికీ ఇప్పటికి నేషనల్ టెస్ట్ ఏజెన్సీ కోర్టు తీర్పుపై ఎలాంటి ముందడుగు వేయకుండా ఉందని ఎన్నారైలు అంటున్నారు.అయితే ఈ విషయం ఏకాభిప్రాయం వస్తే తప్ప ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదని ఒక వేళ ఎన్నారైలు రెండు కోటాలు వినియోగించుకునే పక్షంలో వారికి ఎన్నారైలకు వచ్చే అర్హతలు ఏవీ వర్తించవని అంటున్నారు నిపుణులు.