త్రిష పెళ్లి ఫిక్స్.. వరుడు ఎవరో తెలుసా?

వెండితెరకు 2003వ సంవత్సరంలో “నీ మనసు నాకు తెలుసు” అనే ఈ సినిమా ద్వారా వెండితెరపై అడుగుపెట్టిన నటి త్రిష.ఆతరువాత వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అతడు, పౌర్ణమి వంటి బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపును సంపాదించుకున్నారు.

 Tollywood Senior Heroine Trisha Marriage Fixed With It Employee, Trisha, Tollyw-TeluguStop.com

ఈ క్రమంలోనే ఇటు తెలుగు, అటు తమిళ ఇండస్ట్రీలో వరుస సినిమాలను చేస్తూ ఎంతో స్టార్ డమ్ సంపాదించుకున్న హీరోయిన్ త్రిషకి ఈ మధ్య అవకాశాలు పెద్దగా రావడం లేదని చెప్పవచ్చు.

సీనియర్ హీరోయిన్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న త్రిష పెళ్లి గురించి గత కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు షికార్లు చేస్తున్నాయి.

అయితే ఇప్పటి వరకు ఈ వార్తలలో ఒక్కటి కూడా నిజం కాలేదు.ఈమె త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.తాజాగా ఈమె పెళ్లి వార్త మరోసారి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

Telugu Employee, Fix, Senior, Tollywood, Trisha, Varun Maniyan-Movie

త్రిష పెళ్లి విషయంలో ఆమె కుటుంబ సభ్యులు ఎంతో సీరియస్గానే సంబంధాలు వెతుకుతున్నారని ఈ క్రమంలోనే ఒక ఐ.టి ఉద్యోగితో త్రిషకు పెళ్లి ఫిక్స్ అయిందని వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఈ విషయంలో నైనా ఎంత వరకు నిజం ఉందో లేదో తెలియాలంటే తన పెళ్లి విషయం పై త్రిష అధికారిక ప్రకటన చేసే వరకు వేచి ఉండాల్సిందే.

Telugu Employee, Fix, Senior, Tollywood, Trisha, Varun Maniyan-Movie

అయితే గతంలో త్రిష వ్యాపారవేత్త వరుణ్ మణియన్‌తో పెళ్లికి సిద్ధమై, అతనితో నిశ్చితార్థం కూడా జరుపుకుంది.నిశ్చితార్థం తర్వాత వీరిరువురికీ పలు అభిప్రాయ భేదాలు రావడంతో వీరి పెళ్లిని రద్దు చేసుకున్నారు.ఒకప్పుడు తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోయిన్ గా కొనసాగిన ఈ అమ్మడి చేతిలో ప్రస్తుతం ఎలాంటి పెద్ద సినిమాలు లేవని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube