బుల్లితెర కామెడీ షో ఎక్స్ట్రా జబర్దస్త్ లో సుధీర్ టీమ్ చేసే స్కిట్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయనే సంగతి తెలిసిందే.రామ్ ప్రసాద్ ఆటో పంచ్ లు, సుధీర్ అమాయకంగా ఇచ్చే ఎక్స్ ప్రెషన్లు, చిత్రవిచిత్రమైన గెటప్ లతో గెటప్ శ్రీను పర్ఫామెన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
అయితే సుధీర్ టీమ్ లీడర్ గా ఉండటంపై ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.సుధీర్ టీమ్ లీడర్ గా ఉండటంతో గెటప్ శ్రీనుకు, రామ్ ప్రసాద్ కు సరైన స్థాయిలో గుర్తింపు లభించడం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
సుడిగాలి సుధీర్ కు జబర్దస్త్ షోతో పాటు ఇతర షోలతో బిజీగా ఉన్నారు.తాజాగా గెటప్ శ్రీను నెటిజన్లతో ముచ్చటించగా ఒక నెటిజన్ సుడిగాలి సుధీర్ టీమ్ లీడర్ గా ఉండటానికి అర్హుడేనా అని ప్రశ్నించారు.
ఆ ప్రశ్నకు గెటప్ శ్రీను స్పందిస్తూ సుధీర్ నూటికి నూరు శాతం అర్హుడేనని చెప్పారు.సుడిగాలి సుధీర్ టీమ్ లీడర్ గా ఉండటంపై విమర్శలు వ్యక్తమవుతుండగా ఆ విమర్శలకు గెటప్ శ్రీను చెక్ పెట్టారు.

సుడిగాలి సుధీర్ పై ఉన్న ప్రేమను గెటప్ శ్రీను ఈ విధంగా వెల్లడించారు.ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్లతో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ను నిర్వహించిన గెటప్ శ్రీను ఇతర విషయాలను కూడా అభిమానులతో పంచుకున్నారు.గెటప్ శ్రీను ప్రస్తుతం రాజు యాదవ్ అనే సినిమాలో నటిస్తున్నారు.ఇప్పటికే గెటప్ శ్రీను నటించిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర హిట్ రిజల్ట్ ను సొంతం చేసుకున్నాయి.