ఇటీవల ప్రతిపక్ష నేత చంద్రబాబు సాధన దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే.బాబు చేసిన దీక్ష పై వైసీపీ సీనియర్ నేత విజయ్ సాయి రెడ్డి సెటైర్లు వేయడం జరిగింది.
బాబు దీక్ష వద్దకు కనీసం జనాలు రాలేదని అదే రీతిలో మీడియా కవరేజ్ కూడా లేకుండా పోయింది అంటూ వ్యంగ్యంగా విమర్శలు చేశారు.అంతమాత్రమే కాకుండా టిడిపి కార్యకర్తలు కూడా కనుమరుగైపోయారు ఇది చంద్రబాబు కి ఘోర అవమానం అంటూ తనదైన శైలిలో విమర్శలు చేశారు.
అయితే విజయసాయి రెడ్డి చేసిన విమర్శలపై టిడిపి నేత పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య స్పందించారు.

అక్రమాస్తుల కేసులో ఏ2గా ఉన్న విజయసాయి రెడ్డి.అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని కనీసం విషయ పరిజ్ఞానం లేకుండా విమర్శిస్తున్నారని మండిపడ్డారు.చంద్రబాబు చేపట్టిన సాధన దీక్ష కరోనా నిబంధనలకు అనుగుణంగా పరిమిత సంఖ్యలో నిర్వహించడం జరిగిందని అందువల్ల కొద్ది మంది తోనే దీక్ష చేయటం జరిగిందని వివరణ ఇచ్చారు.
అంతమాత్రమే కాకుండా నాయకుడు చేస్తున్న దీక్షకు కార్యకర్తలు ఎవరు రాకూడదు అని ముందే పార్టీ ప్రకటించటం జరిగిందని అదేరీతిలో కార్యకర్తలు ఎవరికివారు తమ నియోజకవర్గాలలో దీక్ష చేయాలని నాయకుడు సూచించడం జరిగిందని అందువల్లే దీక్షా ప్రాంగణం వద్ద కొద్దిమంది మాత్రమే ఉన్నట్లు వర్ల రామయ్య వివరణ ఇచ్చారు.ఇటువంటి సమయంలో ఈ మాత్రం కూడా తెలియకుండా విమర్శించటం హాస్యాస్పదమని మిడిమిడి జ్ఞానంతో మాట్లాడకూడదు అసలు నువ్వు ఒక ఎంపీ వేనా.? అంటూ వర్ల రామయ్య విజయసాయి రెడ్డి పై మండిపడ్డారు.