తెలుగు సినీ నటుడు అజయ్.ఎక్కువగా విలన్ పాత్రలు, సహాయ పాత్రలలో నటించాడు.తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.తన నటనతో వరుస ఆఫర్లు అందుకొని ఎన్నో సినిమాలలో నటించాడు.2000 సంవత్సరంలో ఇండస్ట్రీకి పరిచయమైన అజయ్ మొత్తానికి తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు అందుకున్నాడు.ఇక ఈ ఏడాది వరుస సినిమాలలో కూడా అవకాశాలు అందుకున్నాడు.
ఇదిలా ఉంటే తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ లో ఇంటర్వ్యూ లో పాల్గొని కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపాడు.తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకున్నాడు.అంతేకాకుండా రాజమౌళితో బ్రేక్ రావడానికి కారణం ఉందని తెలిపాడు.ఇక తను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని తెలిపాడు.
ఇక షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని సన్నివేశాల గురించి పంచుకున్నాడు అజయ్.

సినిమా షూటింగులు చేసేటప్పుడు తనకు చాలా గాయాలయ్యాయని తెలిపాడు.ఒకసారి తనకు షోల్డర్ కూడా కట్ అయిపోయిందట.బన్నీ హీరో గా నటించిన దేశముదురు సినిమా లో షూటింగ్ టైంలో తనకు ఫ్యాక్చర్ అయిందని తెలిపాడు.
విలన్ పాత్రలు కాబట్టి రోప్ షాట్స్ ఉంటాయని తెలిపాడు.ఇప్పుడు చాలా వరకు తగ్గాయని, అప్పట్లో ఎక్కువగా యాక్షన్ సినిమాలని తెలిపాడు.ఇప్పుడు అలా లేదని చాలా మారాయని తెలిపాడు.

ఇక విలన్ పాత్ర అంటే అప్పుడు కూలి పని అంటూ 20 రోజులు 30 రోజులు ఇటువంటి ఫైట్స్ సీను ఎక్కువగా ఉండేవని తెలిపాడు.ఇప్పుడు అలా లేదంటూ రేర్ గా చేస్తున్నారని తెలిపాడు.ఇక తను మహాలక్ష్మి సినిమాలో నటించినప్పుడు రేప్ సీన్ కి ప్లాన్ చేసి ఓ మోడల్ ను తీసుకొని వచ్చారట.
ఇక తనకి రేప్ సీన్ ఉందని చెప్పలేదట.ఇక డైరెక్టర్ తనకు యాక్షన్ చెప్పినప్పుడు ఆమెకు ఈ సీన్ అని తెలియకుండా ఎలా అని అడిగాడట అజయ్.
అంతలో రేప్ సీన్ అనేసరికి అమ్మాయి ఏడ్చిందట.తన వల్ల కాదని, ఈ సీన్ ఏమి చేయలేనని అజయ్ అన్నాడట.
పైగా అమ్మాయి ఏడుస్తుందని వందమంది ముందు అలా చేయాలంటే చాలా చిరాగ్గా ఉంటుందని తెలిపాడు.చూసేవాళ్ళకి బాగానే ఉంటుంది కానీ చేసేవాళ్ళకే చిరాకు అని తెలిపాడు.
ఇక ఇప్పటి వరకు తెలుగు రేప్ సీన్లు రాలేవని చాలా హ్యాపీ అని అభిమానులతో పంచుకున్నాడు.