కొంతమంది వారు కళ్ల ముందు కనిపించింది ఒకటి అయిత దాని గురించి ఆలోచించే విధానం మరొకటిగా చేస్తుండటంతో వారు ఇబ్బంది పడటమే కాకుండా ఇతరులు కూడా ఇబ్బందులు పడటం చూస్తూ ఉంటాం.అయితే తాజాగా తల, కాలు లేని ఓ వింత జంతువు చెట్టుకు వేలాడుతూ కాలనీవాసులకు భయపడుతుందని ఓ మహిళ పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే సదరు ప్రాంతానికి చేరుకున్నారు.
ఆ మహిళ చెప్పిన వింత జంతువుని పరిశీలన కోసం పోలీసులు దాని దగ్గరికి వెళ్లి క్షుణ్నంగా పరిశీలించారు.ఆ తర్వాత ఒక్కసారిగా పోలీసులు అసలు విషయం తెలుసుకొని అవాక్కయ్యారు.
ఎందుకు అని అనుకుంటే మాత్రం సదరు మహిళ అది వింత జంతువు అని చెప్పగా అది కాస్త జంతువే కాదని పోలీసులు తేల్చేశారు.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.
ఈ సంఘటన మొత్తం పోలాండ్ దేశంలో జరిగింది.పోలాండ్ దేశంలోని క్రాక్ అనే నగరంలో ఓ మహిళ తన ఇంటికి సమీపంలో ఉన్న ఓ చెట్టు పై వింత జీవి ఉందని పోలీసులకు తెలుపుతూ అది చూస్తుంటే చాలా భయం వేస్తుందని చెప్పడంతో పోలీసులు ఆ స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు.
ముందుగా ఆ పోలీసులు ఆ మహిళ నుండి పూర్తి వివరాలు సేకరించిన తర్వాత మహిళ చెప్పిన స్థలానికి పోలీసులు వచ్చి దానిని పరిశీలించగా అది కాస్త అనుమానంగా ఉండడంతో దగ్గరికి వెళ్లి పోలీసులు మరింత క్షుణ్ణంగా పరిశీలించారు.
ఇకపోతే అక్కడ ఉన్న దానిలో ఎలాంటి కదలక లేకపోవడంతో వారు దగ్గరికి వెళ్లి దానిని గమనించారు.
దాంతో పోలీసులు షాక్ అయ్యారు.దీనికి కారణం అది జంతువు కానే కాదు ఆ దేశం లో దొరికే ఓ రకమైన బ్రెడ్ మాత్రమే.
ఎవరో అక్కడ పక్షుల కొరకు ఆహారం అందివ్వడానికి ఆ చెట్టుపై బ్రెడ్ ను పెట్టి ఉంటారని పోలీసులు అక్కడి నుంచి వెనుదిరిగారు.దీంతో ఈ విషయం కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.