కృష్ణా జిల్లా పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గం పోరంకి లో వాలంటీర్లకు సత్కారం అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం నిర్వహించింది.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పలువురు వాలంటీర్లకు ఉగాద విశిష్ట సేవా కార్యక్రమాలను ప్రధానం చేయడం జరిగింది.
రాష్ట్రంలో అమలు చేస్తున్న అన్ని సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి సేవలు అదేవిధంగా పెన్షన్ కార్డులు, రేషన్ కార్డులు ఇళ్ల పట్టాల పంపిణీ, జగనన్న తోడు, వైఎస్సార్ రైతు భరోసా, వైయస్సార్ చేయూత, వైయస్సార్ ఆసరా, వైయస్సార్ అమ్మఒడి, వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా, వైయస్సార్ కంటి వెలుగు, రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ, వైయస్సార్ మత్స్యకార భరోసా, జగనన్న విద్యా కానుక, జగనన్న విద్యా దీవె జగనన్న తోడు వంటి 32 సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి వాలంటీర్ల వ్యవస్థ పనితనం అమోఘమని పేర్కొన్నారు.
ఇటువంటి గొప్ప సేవా భావంతో పనిచేస్తున్న వాలింటర్ వ్యవస్థపై కొన్నిసార్లు విపక్షాల నుండి అనేక విమర్శలు వస్తాయి, వాటిని పెద్దగా పట్టించుకోకూడదు అంటూ వాలంటీర్లకు జగన్ సూచించారు.
జీవితంలో క్రమశిక్షణతో మెలిగిన అంతకాలం ఎలాంటి విమర్శలకు పెద్దగా తల వంచ వలసిన అవసరం లేదని అన్నారు.అంత మాత్రమే కాక పండ్లు ఉండే చెట్టు కే ఎక్కువ రాళ్లు తగులుతాయి అని పేర్కొన్నారు.
కాబట్టి ధర్మాన్ని రక్షించండి ప్రభుత్వం నీకు తోడుగా ఉంటుంది చేసేది ఉద్యోగం కాదు సేవ అని గుర్తుపెట్టుకోండి.చేస్తున్న 50 ఇళ్లకు సంబంధించి అవ్వా తాతలు మరియు అక్కచెల్లెళ్ల దీవెనలు అండగా ఉంటాయి అంటూ సీఎం జగన్ వాలంటీర్లు చేస్తున్న సేవలను కొనియాడారు.