పుష్పరాజ్ గా కోహ్లీ.. స్పందించిన అల్లు అర్జున్..!

సైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప.అల్లు అర్జున్ తన కెరీర్ లో మొదటి సారి పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు.

 Virat Kohli In Allu Arjun Pushpa Raj Get Up, Allu Arjun, Virat Kohli, Pushpa-TeluguStop.com

ఈ సినిమాలో అల్లు అర్జున్ ఎర్ర చందనం స్మగ్లర్ గా నటిస్తున్నాడు.అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఇంట్రడక్షన్ టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

తగ్గేదే లే అంటూ అల్లు అర్జున్ రికార్డు సృష్టించాడు.

అయితే సినిమా హీరోలను క్రికెటర్లు కూడా ఫాలో అవుతూ ఉంటారు.

ఈ మధ్య వాళ్ళ అభిమాన హీరోలు నటించిన సినిమాల పాటలను వీడియోలు చేస్తూ హంగామా చేస్తూ ఉన్నారు.ఇయితే ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో పుష్పరాజ్ ఫోటోను మార్ఫింగ్ చేసి కోహ్లీ ఫోటో పెట్టి తగ్గేదే లే అంటూ స్టార్ట్ స్పోర్ట్స్ తెలుగు ట్విట్టర్ పోస్ట్ చేసింది.

ఐపీఎల్ ఈ మధ్యే స్టార్ట్ అయ్యింది.మొదటి మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ముంబై ఇండియన్స్ ఆడింది.ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ను రెండు వికెట్స్ తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓడించింది.ఈ సందర్భంగా స్టార్ట్ స్పోర్ట్స్ తెలుగు ట్విట్టర్ లో ఒక పోస్ట్ షేర్ చేసింది.

పుష్పరాజ్ ఫోటోను మార్ఫింగ్ చేసి కోహ్లీ ఫోటో పెట్టి తగ్గేదే లే ప్రారంభం అదిరింది అంటూ పోస్ట్ చేసారు.

ఈ పోస్టర్ లో కోహ్లీ రూపంపై అసాధారణ స్పందన వస్తుంది.

పుష్ప రాజ్ గా కోహ్లీ ఫోటో అదిరి పోయింది.ఈ ఫోటో ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

ఈ ఫోటో కు అల్లు అర్జున్ కూడా స్పందించారు.అల్లు అర్జున్ స్మైలీ ఈమోజీలను షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ రెండు పోస్టర్ లు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి.

https://twitter.com/StarSportsTel/status/1380581752356229122/photo/1
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube