గుడివాడలో రోడ్లకు మరమ్మత్తులు చేయాలంటూ మాజీ మంత్రి కొడాలి నాని ఇంటి ముట్టడికి యత్నించిన జనసేన పార్టీ శ్రేణులు.జనసేన నేతలను అడ్డుకున్న పోలీసులు, ఇరువురి మధ్య వాగ్వాదం.
జనసేన నాయకులను అరెస్టు చేసేందుకు యత్నించిన పోలీసులు, తామేం నేరం చేశామంటూ ఎదురు తిరిగిన కార్యకర్తలు.భారీగా మోహరించిన పోలీసులు.
గోతులమయంగా ఉన్న కొడాలి నాని ఇంటికి వెళ్లే ప్రధాన రహదారిలో ధర్నా నిర్వహించిన కార్యకర్తలు.మొద్దు నిద్రపోతున్న సీఎం మేలుకోవాలంటూ ఫ్లకార్డులతో నినాదాలు.
కొడాలి నాని,పవన్ కళ్యాణ్ కు రాజకీయాలు నేర్పడం మాని అధ్వానంగ ఉన్న గుడివాడ రోడ్లకు మరమ్మతులు చేయించాలి – జనసేన పార్టీ నేతలు.