దేశంలో కరోనా వైరస్ రోజు రోజుకు తన ప్రతాపాన్ని చూపిస్తుంది.ఇప్పటికే కోవిడ్ విషయంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కీలకమైన ఆదేశాలు జారి చేసిన విషయం తెలిసిందే.
కరోనా కట్టడికి తీసుకోవలసిన నియమాలను తప్పకుండా పాటించాలనే ఆదేశాలు కూడా ఇచ్చింది.ఇకపోతే కోవిడ్ 19 ఉదృతిని అడ్డుకోవాలంటే సమవర్థవంతంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ సాగాలని అభిప్రాయ పడుతున్న కేంద్రం 45 ఏళ్ల వయస్సు దాటిన ప్రభుత్వ ఉద్యోగాలు తప్పకుండా కోవిడ్ టీకా తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది.
ఈ మేరకు కేంద్ర పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సస్ అండ్ పెన్షన్స్ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.ఇకపోతే కరోనా వ్యాక్సిన్ తీసుకున్నామని నిర్లక్ష్యంగా ఉండకుండా తరచూ హ్యాండ్ వాష్ చేసుకోవడం, మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి తదితర కరోనా నివారణ మార్గదర్శకాలను పాటించాలని కేంద్రం సూచించింది.