తెలంగాణలో రాజకీయ వాతావరణం రోజుకో మలుపు తిరుగుతోంది.అధికార టీఆర్ఎస్ ప్రతిపక్షాల దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టడమే ఒక సవాల్ వారి ముందు ఉండగా ఇటు స్వంత పార్టీలోనే ముసలం మొదలవడంతో కేసీఆర్ కు కొత్త సవాళ్ళు ఎదురవుతున్నాయి.
అయితే ఈటెల బహిరంగంగా టీఆర్ఎస్ ను పేరు పెట్టి విమర్శించకుండా, ప్రభుత్వ పథకాలు, ధర్మం, అధర్మం ఇలా వేదాంతాలు మాట్లాడుతూ ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇస్తున్న పరిస్థితి ఉంది.అయితే ఈటెల విషయాన్ని ప్రతిపక్షాలు ఒక అస్త్రంగా మార్చుకొని ప్రభుత్వంపై మాటల తూటాలు ఎక్కుపెడుతున్నాయి.
అయితే ఇప్పటికీ కేసీఆర్ ఈ విషయంపై బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు.అయితే తాజాగా అసెంబ్లీ సమావేశాల సమయంలో ఈటెలను కేటీఆర్ ప్రగతి భవన్ కు తీసుకెళ్లిన విషయం తెలిసిందే.
అయితే కేసీఆర్- ఈటెల- కేటీఆర్ మధ్య జరిగిన సంభాషణ మాత్రం ఏమీ బయటకు రాలేదు.ఆయితే ఇప్పుడు ఈటెలకు ఇప్పుడు ఇతర పార్టీ నేతలు బహిరంగంగానే ఉచిత సలహాలు ఇస్తున్నారు.
తాజాగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఈటెలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈటెల సొంత పార్టీ ఏర్పాటు చేస్తే కేసీఆర్ కంటే గొప్ప నాయకుడిగా ఎదుగుతాడని, ఈటెలకు కావాలనే కేసీఆర్ ప్రాధాన్యత తగ్గిస్తున్నారని ఈటెల తగు నిర్ణయం తీసుకునే సమయం అసన్నమైందని కొండా తెలిపారు.
.