డబ్బులిమ్మని అడిగితే పొగరంటూ దారుణంగా చూస్తారు...

అప్పట్లో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి జీ తెలుగులో ప్రసారమయ్యే “వరూధిని పరిణయం” అనే ధారావాహిక బుల్లితెర ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.అయితే ఈ ధారావాహికలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించి ప్రేక్షకులను బాగా అలరించిన యంగ్ సీరియల్ నటి “ప్రియాంక” తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమే.

 Telugu Serial Actress Priyanka About Remuneration Problems In Serial Industry-TeluguStop.com

ఎందుకంటే ఈ అమ్మడు ఈ ధారావాహికలలో నటించడానికంటే ముందుగా పలు తెలుగు చిత్రాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా కనిపించింది.ఇందులో ముఖ్యంగా నాగ చైతన్య హీరోగా ఎంట్రీ ఇచ్చిన “జోష్” చిత్రంలో హీరో చెల్లెలి పాత్రలో నటించి తన అల్లరితో  బాగానే ఆకట్టుకుంది.

అయితే తాజాగా ప్రియాంక ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని తాను సినిమా పరిశ్రమకు వచ్చిన కొత్తలో ఎదుర్కొన్న సంఘటనలగురించి ప్రేక్షకులతో పంచుకుంది.

ఇందులో ముఖ్యంగా తను కూడా అందరిలాగే తన నటనా ప్రతిభను నిరూపించుకుని నటిగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని సినిమా పరిశ్రమకి వచ్చానని తెలిపింది.

ఈ క్రమంలో మొదట్లో సినిమా అవకాశాల విషయంలో కొంతమేర ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ క్రమక్రమంగా అవకాశాలు దక్కించుకుంటూ ప్రస్తుతం బాగా రాణిస్తున్నానని తెలిపింది.అయితే మొదట్లో సినిమా ఆడిషన్లకు వెళితే అందరి ముందు తనని ఎంపిక చేసినట్లు చెబుతూ మళ్లీ ఇంటికి వెళ్ళిన తర్వాత డైరెక్టర్ మరియు ప్రొడ్యూసర్ మరోమారు చూడాలంటూ ఒంటరిగా హోటల్ కి రావాలంటూ పిలిచేవారని అలాంటి సంఘటనలు చాలానే ఎదుర్కొన్నానని తెలిపింది.

అలాగే తాను మాత్రం ఎప్పుడూ కూడా సినిమా అవకాశాల కోసం అడ్డదారులు తొక్క లేదని కూడా స్పష్టం చేసింది.

అలాగే సీరియల్ నటీనటులకు చాలా కష్టాలు ఉంటాయని సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఇందులో ముఖ్యంగా సీరియల్ ఆర్టిస్టులు కాస్ట్యూమ్ నుంచి మేకప్ వరకు అన్నీ తామే భరించాల్సి ఉంటుందని అందువల్లనే పేమెంట్స్ ఈ విషయంలో కొంతమేర జాగ్రత్తగా ఉంటామని దాంతో కొందరు యాటిట్యూడ్ చూపిస్తోందని కూడా కామెంట్లు చేస్తుంటారని తెలిపింది.కానీ ఎవరు ఏమనుకున్నా సరే తాను మాత్రం డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటానని, అంతేగాక తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తే మాత్రం ఊరుకోనని తెలిపింది.

ఎందుకంటే తన జీవితంలో ప్రతి రూపాయి కూడా చాలా విలువైందని అందుకే కష్టపడిన సొమ్ముని ఖచ్చితంగా వదులుకోకూడదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube