హీరోగా ఎంట్రీ ఇస్తున్న సీరియల్ హీరో...

తెలుగులో అప్పట్లో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయిన జెమిని ఛానల్ లో ప్రసారమయ్యే చి.ల.సౌ స్రవంతి ధారావాహికలో హీరోగా నటించి బుల్లి తెర ప్రేక్షకులను అలరించిన ప్రముఖ సీరియల్ నటుడు నంద కిషోర్ గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే నంద కిషోర్ కేవలం ధారావాహికలలో మాత్రమే కాకుండా అప్పుడప్పుడు పలు చిత్రాలలో కూడా కనిపించాడు.

 Serial Hero Nanda Kishore Debut With Narasimhapuram Movie-TeluguStop.com

కానీ నంద కిషోర్  నటించిన పాత్రలకి పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో ఎవరూ గుర్తించలేదు.

కాగా ప్రస్తుతం నంద కిషోర్ తెలుగులో “నరసింహ పురం” అనే ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

ఈ చిత్రంలో కిషోర్ సరసన పలు షార్ట్ ఫిలిమ్స్ మరియు సీరియళ్ల  ద్వారా పాపులర్ అయిన నటి ఉషశ్రీ హీరోయిన్ గా నటిస్తోంది.కాగా నూతన దర్శకుడు రాజ్ బాలాజీ దర్శకత్వం వహించగా పిఆర్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు.

తాజాగా ఈచిత్రానికి సంబంధించిన ట్రైలర్ ని చిత్ర యూనిట్ సభ్యులు యూట్యూబ్ లో విడుదల చేశారు.అయితే ఈ చిత్ర ట్రైలర్ ని ఒకసారి పరిశీలించినట్లయితే తన మాస్ మరియు క్లాస్ యాక్షన్ తో నంద కిషోర్ సరికొత్తగా ప్రేక్షకుల్ని అలరించబోతున్నట్లు స్పష్టం గా తెలుస్తోంది.

అంతేకాక ఫ్యాక్షన్ మరియు క్రైమ్ థ్రిల్లర్ తో దర్శకుడు కొత్త ప్రయోగాన్ని చేశాడు.దీంతో నటీనటులు కూడా పర్వాలేదనిపించారు.

మరి ట్రైలర్ తో పర్వాలేదనిపించిన నంద కిషోర్ ఈ సినిమాతో ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.

అయితే మొగలి రేకులు సీరియల్ ద్వారా ఆ మద్య హీరో గా ఎంట్రీ ఇచ్చిన ఆర్ కె నాయుడు అలియాస్ సాగర్ ప్రస్తుతం బాగానే రాణిస్తున్నాడు.

దీంతో నంద కిషోర్ కూడా నటన పరంగా ఎంతో ప్రతిభ ఉండటంతో హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నంద కిషోర్ ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయిన “జీ తెలుగు”లో ప్రసారం అవుతున్న “రామ సక్కని సీత” అనే ధారావాహికలో కూడా మెయిన్ లీడ్ పాత్రలో నటిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube