ఈ అందమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోజుకి ఎంత తీసుకుంటుందో తెలుసా..?

తెలుగులో ప్రముఖ దర్శకుడు విద్యా సాగర్ రాజు దర్శకత్వం వహించిన ఫక్ (F.C.U.K) (ఫాదర్ చిట్టి ఉమా కార్తీక్)  చిత్రంలో హీరోయిన్ తల్లి పాత్రలో నటించి మానవ ప్రపంచంలో జెండర్ సమానత్వం గురించి చెప్పేటువంటి డైలాగులతో సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన టాలీవుడ్ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ “కళ్యాణి నటరాజన్” గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే కళ్యాణి నటరాజన్ స్వతహాగా తమిళ సినిమా పరిశ్రమకి చెందిన నటి.అయితే ఈమెకి తెలుగు మాట్లాడడం  సరిగా రాకపోయినప్పటికీ డబ్బింగ్ ద్వారా మేనేజ్ చేస్తోంది.అయితే కళ్యాణి నటరాజన్ సినిమాల్లోకి రాకముందు దాదాపుగా 15 కు పైగా పలు సంస్థల వాణిజ్య ప్రకటనల్లో కూడా నటించింది.అంతేకాక మోడలింగ్ రంగంలో కూడా కొంత కాలం పాటు పని చేసింది.

 Telugu Character Artist Kalyani Natarajan Remuneration News-TeluguStop.com

అయితే కళ్యాణి నటరాజన్ తెలుగు తమిళ సినిమాల్లో నటించడానికి తీసుకునేటువంటి పారితోషికం విషయం పై పలు వార్తలు సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల అవుతున్నాయి.అయితే కళ్యాణి నటరాజన్ ఒక్క సినిమాకి దాదాపుగా “రెండు లక్షల రూపాయల నుంచి మూడు లక్షల రూపాయలు పారితోషకం తీసుకుంటుందట.

అంతేగాక షూటింగ్ ప్రదేశాలకు చేరుకోవడానికి అయ్యే రవాణా ఖర్చులతో పాటు బస చేయడానికి హోటల్ వసతులు మరియు ఇతర ఖర్చులు కూడా నిర్మాతలే భరించాల్సి ఉంటుందట.అలాగే ఒక్కోసారి కళ్యాణి నటరాజన్ పారితోషకం సినిమా బడ్జెట్ పై కూడా ఆధారపడి ఉంటుంది.

ఈ విషయం ఇలా ఉండగా ఆ మధ్య కళ్యాణి నటరాజన్ తెలుగులో కవచం, అల వైకుంటపురంలో, సోలో బ్రతుకే సో బెటర్, తదితర చిత్రాలలో నటించింది.కానీ 2018 సంవత్సరంలో ప్రముఖ దర్శకుడు పరుశురాం దర్శకత్వంలో వహించిన గీత గోవిందం చిత్రంలో ఇంటర్మీడియట్ స్టూడెంట్ తల్లి పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

దీంతో ప్రస్తుతం వరుస టాలీవుడ్ చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube