అమెరికా: మసాజ్ సెంటర్లలో మహిళలే టార్గెట్.. ఉన్మాది కాల్పుల్లో 8 మంది మృతి

అమెరికాలో మరోసారి తుపాకులు గర్జించాయి.గడిచిన రెండు రోజుల వ్యవధిలో వేరు వేరు చోట్ల జరిగిన ఘటనల్లో 13 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు.

సోమవారం చికాగోలో ఓ పార్టీ జరుగుతుండగా దుండగులు కాల్పులకు తెగబడ్డారు.ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, మరో 13 మంది గాయపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.ఆదివారం తెల్లవారుజామున 4.40 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు.క్షతగాత్రుల్లో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో గత బుధవారం జరిగిన ఘటనలో ముగ్గురు మరణించారు.ఈ రెండు ఘటనలు జరిగి వారం తిరగకముందే నిన్న అట్లాంటా ప్రాంతంలోని మసాజ్ పార్లర్లే లక్ష్యంగా దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు.

Advertisement

ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా.వీరిలో ఏడుగురు మహిళలే కావడం దురదృష్టకరం.

వుడ్‌స్టాక్‌కు చెందిన రాబర్ట్ ఆరోన్ లాంగ్‌ మంగళవారం అట్లాంటాలో ఉన్న ఓ బ్యూటీ స్పా దగ్గర దోపిడి చేయడానికి ప్రయత్నించాడు.ఈ క్రమంలో అతడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన వారిపై ఏమాత్రం కనికరం లేకుండా విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.5.47గంటల ప్రాంతంలో ఈశాన్య ప్రాంతంలో ఉన్న గోల్డ్‌ స్పా వద్ద జరిపిన కాల్పుల ఘటనలో ముగ్గురు మహిళలను పొట్టనబెట్టుకున్నాడు.సమాచారం అందుకున్న పోలీసులు భారీగా చేరుకున్నారు.

అధికారులు సంఘటన స్థలంలో ఉండగానే.అరోమాథెరపీ స్పా వద్ద మరో కాల్పుల ఘటన చోటు చేసుకుంది.

ఇక్కడ మరో మహిళ మృతి చెందిందని పోలీస్ చీఫ్ రోడ్నీ బ్రయంట్ తెలిపారు.కాల్పులకు తెగబడిన ఆరోన్‌లాంగ్‌ను రాత్రి 8.30గంటల ప్రాంతంలో జార్జియాలోని క్రిస్ప్‌ కౌంటీలో పోలీసులు అరెస్ట్ చేశారు.మూడు స్పాల్లో కాల్పులకు పాల్పడింది లాంగేనని గుర్తించినట్లు కెప్టెన్‌ జే బేకర్‌ పేర్కొన్నారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

అయితే కాల్పుల ఘటన వెనుక ఉన్న ఉద్దేశం తెలియదని.ఆసియా మహిళలనే లక్ష్యంగా చేసుకునే దాడి జరిగినట్లు వెంటనే చెప్పడం కష్టమని పేర్కొన్నారు.

Advertisement

కాగా, అమెరికాలో గత కొన్ని రోజులుగా ఆసియా సంతతి వారిని టార్గెట్ చేసుకుని జాత్యహంకార దాడులకు తెగబడుతున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి.ఇది ఆ కోవకు చెందినదేనా లేక దుండగుడు కేవలం దోపిడి కోసమే హత్యలకు పాల్పడ్డాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తాజా వార్తలు