కరోనా ప్రజల నుండి పూర్తిగా పోలేదని అధికారులు హెచ్చరిస్తున్నా మనకు ఏం అవుతుందిలే అనే నిర్లక్ష్యం వల్ల ముంచుకొచ్చే ముప్పును పసిగట్టలేని స్దితిలో ప్రజలు ఉన్నారట.ఇప్పటికే దేశంలో కోవిడ్ కేసులు నమోదవుతున్న క్రమంలో జాగ్రత్తలు తీసుకోవలసింది పోయి గుంపులుగా ఉన్నప్పుడు కూడా తగిన చర్యలు పాటించడం లేదని తెలుస్తుంది.
ఇకపోతే ఇటీవల కరీంనగర్, వరంగల్ జిల్లాలోనూ కరోనా కేసులు వెలుగుచూశాయన్న విషయం తెలిసిందే.అదీగాక వరంగల్‌లో పాఠశాల విద్యార్థులకు కరోనా వైరస్ సోకడంతో క్వారంటైన్‌కి తరలించారు.సిద్దిపేట జిల్లా కొండపాక పాఠశాల టీచర్‌కి కరోనా రావడంతో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు.తాజాగా మేడారంలో కరోనా కేసులు వెలుగుచూడడం కలకలం రేపుతోంది.
ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ముగ్గురు దేవాదాయశాఖ సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.మరికొంత మందిలో కూడా కోవిడ్ లక్షణాలు కనిపించాయట.ఈ నేపధ్యంలో అధికారులు మరికొన్ని కరోనా కేసులు కూడా ఉండొచ్చు అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారట.ఏది ఏమైనా ఎవరి జాగ్రత్తలో వారుండకపోతే మళ్లీ పరిస్దితులు మొదలకు రావడం ఖాయమంటున్నారు.