ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఓ రేంజ్ లో దూసుకుపోతున్నారు.అందరికంటే ఎక్కువ స్థాయిలో ముందున్నాడు ప్రభాస్.
మొదటిసారి పాన్ ఇండియా సినిమాలో నటించిన ప్రభాస్ రేంజ్ నిజంగానే మారింది.ప్రస్తుతం వరుస ఆఫర్ లతో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.
బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ మాత్రం బాలీవుడ్ వరకు దూసుకెళ్లింది.ఇతర భాషల్లో విడుదలైన ఈ సినిమాతో ప్రభాస్ కు మంచి గుర్తింపు వచ్చింది.ఇదిలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం వరుస ఆఫర్లు మోసుకుంటూ బిజీ గా మారాడు.అవి కూడా పాన్ ఇండియా కథలే.
ఈ మధ్య ప్రభాస్ కాకుండా మరో స్టార్ హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాలు కే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.ఏకంగా కొందరు హీరోలు ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలో చేస్తున్నారు.

ఇక ప్రభాస్ ను టాలీవుడ్ దర్శకులే కాకుండా బాలీవుడ్, ఇతర సినీ దర్శకులు కూడా వదలడం లేదు.ప్రస్తుతం ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాల్లో బిజీగా ఉన్నాడు.ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయడానికి సినీ బృందం సిద్ధంగా ఉన్నారట.ఇక ప్రస్తుతం రాధేశ్యాం సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమా జూలై 30న విడుదలకానుంది.
అంతేకాకుండా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా, మరో స్టార్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో నటించనున్నాడు.2022 లో ఆది పురుష్ సినిమా, 2023 లో నాగ్ అశ్విన్ సినిమా విడుదల కానుంది.ఇదిలా ఉంటే ప్రభాస్ మరో బాలీవుడ్ స్టార్ దర్శకుడితో ఓ సినిమా చేయనున్నాడట.
అది కూడా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ బ్యానర్ లోనూ ప్రభాస్ ఓ సినిమాను చేయనున్నాడు.ఇక ఈ సంస్థ టాలీవుడ్ దర్శకుడిని కాకుండా, బాలీవుడ్ దర్శకుడు అయితే మరింత క్రేజ్ వస్తుందని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.