ఏపీ ప్రభుత్వాధినేత, సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డికి చెందిన భారతి సిమెంట్స్ రేంజ్ ఇప్పుడు మామూలుగా లేదు.
తమ పార్టీ అధికారంలో ఉండడంతో కంపెనీ భారీ లాభాల్లో దూసుకు వెళ్లే విధంగా ప్రభుత్వ పెద్దలు పావులు కదుపుతోన్న పరిస్థితి.ప్రభుత్వ పరంగా జరిగే సిమెంట్ కొనుగోళ్ల విషయంలో కేవలం భారతి సిమెంట్స్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తోంది.
అంతెందుకు గత ఎనిమిది నెలల కాలంలో ప్రభుత్వ పరంగా కొనుగోలు చేసిన మొత్తం సిమెంట్స్‌లో 14 శాతం సిమెంట్స్ భారతీ కంపెనీకే చెందిందని లెక్కలు చెపుతున్నాయి.
భారతి సిమెంట్స్ తర్వాత స్థానంలో ఇండియా సిమెంట్స్ ఉంది.
ఈ రెండు కంపెనీలకు చెందిన సిమెంట్‌నే ఏకంగా 30 శాతం వరకు కొనుగోళ్లు జరిగాయి.అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ కూడా ఉంది.ప్రభుత్వానికి సిమెంట్ కంపెనీలు రు.225కే సరఫరా చేయాలన్న నిబంధన ఉంది.బయట బహిరంగ మార్కెట్లో సిమెంట్ బస్తా ధర రు.370 వరకు పలుకుతోంది.కానీ ఇక్కడ మాత్రం రు.225కే సరఫరా చేయాల్సి ఉంది.అయితే ఇలా సరఫరా చేస్తే భారతి సిమెంట్స్‌కు మాత్రం ఏం లాభం ఉంటుందన్న సందేహం కూడా ఉంది.

అయితే ప్రస్తుతం సిమెంట్ కంపెనీలు అన్నీ సిండికేట్ అయిపోయి.మార్కెట్‌లో కొరత సృష్టిస్తున్నాయి.ఫలితంగా సిమెంట్ బస్తా నాలుగు వందలకు చేరిందని కన్‌స్ట్రక్షన్ వర్గాలు గగ్గోలు పెడుతున్నాయి.
అయినా ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోవడం లేదు.ఫలితంగా సామాన్యులు సిమెంట్ ధరల విషయంలో గగ్గోలు పెడుతున్నారు.
భారతి సిమెంట్స్‌లో ఫ్రాన్స్‌కు చెందిన వికాట్ సంస్థకు వాటా ఉంది.ఈ ధరల పెరుగుదల వల్ల కేవలం ఒక్క యేడాదిలోనే తమ సంస్థకు రు.1000 కోట్ల లాభం వస్తుందని ఆ కంపెనీ చెప్పింది.
దీనిని తెలుగుదేశం పార్టీ హైలెట్ చేస్తూ భారతి సిమెంట్స్‌కు భారీ ఎత్తున దోచి పెడుతున్నారని విమర్శలు చేస్తోంది.
మరి దీనిపై ప్రభుత్వ వర్గాలు ఎలా స్పందిస్తాయో ? చూడాలి.