తెలుగులో ప్రముఖ దర్శకుడు సత్యం చల్లకోటి దర్శకత్వం వహించిన “ఓయ్ నిన్నే” అనే చిత్రం తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికీ బాగానే గుర్తుంటుంది.అయితే ఈ చిత్రం విడుదల సమయంలో చిత్ర యూనిట్ సభ్యులు ప్రమోషన్స్లో కొంత మేర శ్రద్ధ వహించకపోవడంతో ఎక్కువ మందికి తెలియదు.
అయితే ఈ చిత్రంలో హీరోగా టాలీవుడ్ యంగ్ హీరో “మరగాని భరత్” నటించగా హీరోయిన్ గా యంగ్ హీరోయిన్ సృష్టి దంగే నటించింది.అయితే ఈ చిత్రం అనుకోకుండా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడడంతో హీరో భరత్ ఇక సినిమాలకు స్వస్తి చెప్పాడు.
అనంతరం ప్రజలకు సేవ చేయాలనే మంచి ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించినటువంటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. అంతేగాక రాజకీయాల్లోకి అడుగు పెట్టిన కొద్ది కాలంలోనే మంచి పనులు చేస్తూ ప్రజల దృష్టిని ఆకర్షించాడు.
దీంతో గత ఏడాది జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలలో రాజమండ్రి నియోజకవర్గం నుంచి లోక్సభ అభ్యర్థిగా పోటీ చేశాడు.దీంతో అత్యధిక మెజార్టీతో గెలుపొందాడు.
కాగా ప్రస్తుతం ఒకపక్క ప్రజల సమస్యలు ఇచ్చేందుకు కృషి చేస్తూనే మరో పక్క వై.కా.పా పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ పాల్గొంటున్నాడు.అయితే అప్పటికి భరత్ తండ్రి మార్గాని నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక చక్రం తిప్పుతున్నాడు అందువల్లనే ఈ సారి అతడి స్థానంలో భరత్ కి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది.