సౌత్ ఇండియాలో క్రేజీ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ సాయి పల్లవి.ప్రేమమ్ సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ అమ్మడు ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకి చేరువ అయ్యింది.
సినిమాతో ఆమె చేసిన భానుమతి పాత్ర ప్రతి ఒక్కరికి బాగా కనెక్ట్ అయ్యింది.దాంతో పాటు సినిమాలో ఆమె డాన్స్ కి అందరూ ఫిదా అయిపోయారు.
ఈ మధ్యకాలంలో డాన్స్ తో ప్రేక్షకులని మెప్పించే హీరోయిన్లు పెద్దగా కనిపించలేదు.ఇలాంటి సమయంలో డాన్స్ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన సాయి పల్లవి తన టాలెంట్ తో ఒక్కసారిగా అందరికి కనెక్ట్ అయిపొయింది.ప్రత్యేకంగా ఆమె డాన్స్ స్టెప్పులు చూడటానికి సాయి పల్లవి నటించిన సినిమాలకి వెళ్లేవారు ఉన్నారు.మారి2 సినిమాలో రౌడీ బాబీ సాంగ్ తో సాయి పల్లవి మరింత పాపులర్ అయిపొయింది.ఇక సినిమాల ఎంపికలో అందరి హీరోయిన్లు మాదిరి కాకుండా మనసుకి నచ్చే పాత్రలు మాత్రమే ఈ అమ్మడు చేసుకుంటూ వెళ్తుంది.అయినా కూడా ప్రస్తుతం ఆమె చేతిలో ఓ నాలుగు సినిమాల వరకు ఉన్నాయి.
ఇదిలా ఉంటే తాజాగా ఈ భామ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చైతూకి జోడీగా లవ్ స్టోరీ అనే సినిమా చేసింది.ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమాని శేఖర్ కమ్ముల ఆవిష్కరించారు.అయినా కూడా సాయి పల్లవిని ప్రేక్షకులుకోరుకునే డాన్స్ తో ఒక సాంగ్ పెట్టారు.ఇక ఫిదా సినిమాలో ఆమె గాల్లో ఎగురుతూ వేసిన డాన్స్ ఫీట్ అందరికి బాగా కనెక్ట్ అయ్యింది అదే మాదిరి లవ్ స్టోరీ సినిమాలో ఓ డాన్స్ బీట్ లో సాయి పల్లవి గాల్లో ఎగిరే మూమెంట్ ఇప్పుడుసోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.దీనిని ఫిదా సినిమాలో డాన్స్ మూమెంట్ తో పోల్చి చూస్తున్నారు.
అలాగే ఆ సినిమా హిట్ అయినట్లే ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని చెబుతున్నారు.కొంతమంది సాయి పల్లవి గాల్లో ఎగిరిన విజువల్ ఫోటో చేసుకొని వాల్ పేపర్ గా మార్చేసుకుంటున్నారు.
ఈ డాన్స్ మూమెంట్ వైరల్ కావడం బట్టి సాయి పల్లవి క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.