మెగా హీరో రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి పాత్రలో నటిస్తున్నాడు.పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా మన విప్లవ కెరటాలు అయిన అల్లూరి, కొమరామ్ భీమ్ ని రాజమౌళి దేశవ్యాప్తంగా గుర్తించేలా చేస్తున్నాడు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.దీని తర్వాత చరణ్ మెగాస్టార్, కొరటాల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో మరో హీరోగా కనిపించబోతున్నాడు.
ఈ పాత్ర నిడివి తక్కువే అయినా సెకండ్ ఆఫ్ లో చాలా కీలకంగా ఉంటుందని తెలుస్తుంది.ఈ నేపధ్యంలో ఈ పాత్రకి ఒక హీరోయిన్ కూడా ప్లాన్ చేశారు.
అయితే ఈ పాత్ర కోసం ఎప్పటి నుంచో రష్మిక మందన పేరు వినిపిస్తుంది.అయితే ఇప్పుడు రష్మిక కాకుండా బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది.
దీనికి కారణం కూడా ఉంది.
ఆర్ఆర్ఆర్ సినిమా
తరువాత రామ్ చరణ్ పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకుంటాడు.ఇప్పటికే చిరంజీవి కూడా సైరాని పాన్ ఇండియా స్థాయిలోనే రిలీజ్ చేశారు.ఈ నేపధ్యంలో తండ్రి, కొడుకుల కలయికలో వస్తున్న ఆచార్య మూవీని కూడా పాన్ ఇండియా స్థాయిలో ఆవిష్కరించాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది.
ఈ నేపధ్యంలో హీరోయిన్ గా రష్మిక కంటే బాలీవుడ్ లో మార్కెట్ ఉన్న హీరోయిన్ అయితే కాస్తా నార్త్ టచ్ ఇచ్చినట్లు ఉంటుందని భావించి ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.ఈ నేపధ్యంలో కైరా అద్వానీని హీరోయిన్ రేసులో పరిశీలిస్తున్నట్లు బోగట్టా.
త్వరలో దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.