తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 ముగింపు దశకు వచ్చేసింది.ఈ వారం కాకుండా మరో వారం మాత్రమే మిగిలి ఉంది.
ఈ సమయంలో ఇంటి సభ్యుల కోసం ఫినాలే మెడల్ ను ఇచ్చేందుకు ఆవు పాల టాస్క్ ను పెట్టడం జరిగింది.ఆ టాస్క్‌లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా తమ ప్రాణం పెట్టి ఆడాలంటూ బిగ్‌బాస్ మరీ మరీ చెప్పి ఖచ్చితంగా గొడవలు పెట్టుకోవాలంటూ ఇండైరెక్ట్‌గా బలంగా చెప్పాడు.
దాంతో కంటెస్టెంట్స్ అంతా కూడా హడావుడి చేశారు.ఆవు నుండి వచ్చే పాలను దక్కించుకునేందుకు ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడ్డారు.
ఆ సమయంలో అవినాష్ కాస్త టెంపర్ కోల్పోయాడు.ఇప్పటికే నామినేషన్‌లో ఉన్నాను అనే టెన్షన్ మరియు ఆందోళన అతడిలో కనిపిస్తున్నాయి.
ఈసమయంలో అతడు ఎక్కడ లేని కోపంను అఖిల్, సోహెల్ మరియు మోనాల్‌పై చూపించే ప్రయత్నం చేశాడు.గేమ్ లో భాగంగా ఆమె కాలు తలిగి ఉంటుంది.
దాంతో మోనాల్ తన్నింది అంటూ రచ్చ చేశాడు.

మొత్తానికి పాల టాస్క్‌లో అవినాష్ తీరు ఏమాత్రం సరిగా లేదు అంటూ ఇంటి సభ్యులతో పాటు ప్రేక్షకులు కూడా అసహనం వ్యక్తం చేశారు.ఏం అయినా చేసుకోవచ్చు అంటూ బిగ్ బాస్ చెప్పడంతో బాత్ రూంకు వెళ్లి కొన్ని నీళ్లు.డైనింగ్ హాల్ కు వెళ్లి కొన్ని నీళ్లు కలపడంతో పాటు ఫ్రిడ్జ్ లో ఉన్న నీటిని కూడా అవినాష్ కలిపి తన ప్రయత్నం తాను చేశాడు.
గేమ్ నుండి మొదట్లోనే బయటకు వెళ్లి పోయిన పర్వాలేదు కాని గేమ్ ను వదిలేయడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు.టాస్క్ ను చేయను.మీరు , మీరు ఆడుకుంటున్నారు అంటూ అవినాష్ పదే పదే మొత్తుకోవడంతో అతడి తీరు ప్రేక్షకులకు చిరాకు తెప్పించింది.ఇలాంటి సమయంలో ప్రవర్తన చాలా అవసరం.
ఎందుకంటే ఆయన ప్రస్తుతం ఎలిమినేషన్ కు నామినేట్ అయ్యి ఉన్నాడు.ప్రేక్షకులు అన్ని విషయాలను గమనిస్తున్నారు అనే విషయం అర్థం చేసుకోవాలి.
సింపతీ కోసం ఓట్లు రావని అవినాష్ తెలుసుకోలేక కాస్త ఓవర్ యాక్షన్ చేయడంతో ఆయన ఖేల్ ఖతం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.