అమెరికా వెళ్లే భారతీయులకు ఎయిరిండియా శుభవార్త

సాధారణంగా మనదేశం నుంచి అమెరికా వెళ్లాలంటే నేరుగా విమానం ఉండదు.భారత్‌లోని ప్రధాన నగరాల నుంచి విమానం ఎక్కి.

 Air India Announces First Direct Flight Between Bengaluru And San Francisco, Kem-TeluguStop.com

దుబాయ్‌లో ఫ్లైట్ మారాల్సి వుంటుంది.సుదీర్ఘ ప్రయాణం, ఇంధన సమస్యలు, సాంకేతిక కారణాలతో కనెక్ట్ ఫ్లైట్ విధానంలో పలు విమానయాన సంస్థలు భారతీయులను అమెరికాకు చేరుస్తున్నాయి.

అయితే ఇకపై ఇలాంటి కష్టాలకు తెరదించింది ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా.కర్ణాటక రాజధాని బెంగళూరు నుంచి అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోకు ఎయిరిండియా మొదటిసారిగా నాన్‌స్టాప్ విమానాన్ని నడపనుంది.

వచ్చే ఏడాది జనవరి 11న ఈ విమానం బెంగళూరు నుంచి టేకాఫ్ అవ్వనుంది.ఈ విషయాన్ని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు గురువారం తెలిపారు.మనదేశం నుంచి సుదీర్ఘ సమయం ప్రయాణించనున్న తొలి విమానం ఇదే.బెంగళూరు నుంచి 14 వేల కిలోమీటర్ల దూరాన్ని 16 గంటల పాటు నిరంతరాయంగా ప్రయాణించి ఈ విమానం శాన్‌ఫ్రాన్సిస్కో చేరుకోనుంది.ఇప్పటికే టికెట్ల రిజర్వేషన్‌ను ప్రారంభించామని వారంలో రెండు రోజుల పాటు ఈ విమాన సేవలు ఉంటాయని అధికారులు పేర్కొన్నారు.

Telugu Bangalore, Coast-Telugu NRI

* యునైటెడ్ స్టేట్స్ వెస్ట్ కోస్ట్‌లోని నగరాలకు వేగంగా సులభంగా చేరుకోవడానికి ఈ సర్వీస్ ద్వారా భారతీయులకు వీలు కలుగుతుంది

* ఈ నాన్‌ స్టాప్ విమానం శాన్స్‌ఫ్రాన్సిస్కోతో పాటు దీనికి దగ్గరగా వున్న ప్రాంతాలకు ప్రయాణించడానికి కార్పోరేట్ వర్గాలకు దోహదం చేస్తుంది

* 238 సీట్ల సామర్ధ్యం వున్న బోయింగ్ 777-200 ఎల్ఆర్ విమానాలను ఈ నాన్ స్టాప్ సర్వీస్ కోసం ఎయిరిండియా వినియోగించనుంది.

* డిజిటల్ పరంగా అభివృద్ధి చెందిన ప్రపంచంలోనే టాప్-45 నగరాల్లో శాన్‌ఫ్రాన్సిస్కో, బెంగళూరు నగరాలు మొదటి, రెండవ స్థానంలో వున్నాయి.

* ఈ నాన్‌స్టాప్ సర్వీస్ రెండు రికార్డులను నెలకొల్పింది.

ఎయిరిండియా ఆపరేట్ చేస్తున్న అతి సుదీర్ఘ మార్గం (14,000 కి.మీ).అలాగే భారతదేశానికి వెలుపల అతి సుదీర్ఘ సమయం (16 గంటలు) పాటు ప్రయాణించే సర్వీస్ .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube