తెలుగులో ప్రముఖ దర్శకుడు కూచిపూడి వెంకట్ దర్శకత్వం వహించిన “మొదటి సిసినిమా” అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయం అయిన మలయాళ బ్యూటీ “పూనమ్ బజ్వా” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే వచ్చీరావడంతోనే పర్వాలేదనిపించిన ఈ బ్యూటీ ఎందుకో కొత్త సినిమా అవకాశాలు దక్కించుకోవడంలో కొంతమేర విఫలమైంది.
దీంతో ఎక్కువ కాలం హీరోయిన్ గా కొనసాగలేక పోయింది.
అయితే ప్రస్తుతం పూనమ్ బజ్వా కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో సినిమా అవకాశాలు లేక ఇంటిపట్టునే ఉంటుంది.
ఈ క్రమంలో పలు ఫోటోసు సంస్థలు నిర్వహించే ఫోటో షూట్ కార్యక్రమాలలో పాల్గొంటూ తన అనాదమైన ఫోటోలని తన అధికారిక ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తోంది.ఈమధ్య పూనమ్ బజ్వా సినీ అవకాశాల కోసం కొంతమేర గ్లామర్ డోస్ పెంచినట్లు తెలుస్తోంది.
అయితే తను మొదట హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి నటువంటి తెలుగులో పెద్దగా రాణించలేకపోయినప్పటికీ మలయాళం, తమిళం, సినీ పరిశ్రమలో మాత్రం వరస అవకాశాలు దక్కించుకుంటూ బాగానే రాణించింది.
అయితే తెలుగులో చివరగా ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన “ఎన్టీఆర్ కథానాయకుడు” చిత్రంలో గరపాటి లోకేశ్వరి పాత్రలో నటించింది.
ఆ తర్వాత మళ్లీ ఇప్పటివరకు తెలుగు సినిమాలలో నటించలేదు.ప్రస్తుతం మలయాళంలో ఓ ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.