పాములు.కనపడటానికి చిన్న ప్రాణులైనా, అత్యంత భయంకరమైన జంతువులను కూడా భయ పెట్టడంలో ఇవి ముందుంటాయి.అంతెందుకు మనుషికి పాములంటే ఎంతో భయం.అవును.నిర్మానుష్యమైన ప్రాంతంలో మసలడానికి మనం వెనకడుగు వేస్తాం.ఎందుకంటే… అక్కడ పాములు ఎక్కడుంటాయో అని తెగ భయపడిపోతుంటాం.ఇకపోతే అలాంటి భయంకరమైన పాములను చూసి ఒకే ఒక్క ప్రాణి మాత్రం పిచ్చెక్కి పాములపైన దాడి చేసి, చివరకు దాన్ని అంతం చేసే వరకూ వదిలి పెట్టదు.
అదే ముంగీస.
ముంగీసల దగ్గర పాములు చతికలపడాల్సిందే.అతి చిన్న ముంగీస కూడా.
భయంకరమైన పాములను పడగొట్టడంలో నైపుణ్యం కలిగి ఉంటుంది.అందుకు మంచి ఉదాహరణే ఈ వీడియో.
మహారాష్ట్ర వెస్ట్ నాసిక్ డివిజన్ అడవుల డిప్యూటీ కన్సర్వేటర్ ఆఫీసర్ ఒకరు సదరు వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ అయింది.అసలు విషయం ఏమిటంటే.
ఆ అడవిలో ఓ చెట్టు కొమ్మపై పాము నిద్రపోతోంది.ఆ కొమ్మ దాదాపుగా నేలని తాకి ఉంది.కానీ అక్కడ పాము ఉన్నట్లుగా ఎవరికీ కనిపించట్లేదు.
కానీ ఆ మాయదారి ముంగీసకు మాత్రం అది కనిపించింది.
దాంతో.ఆ చోటికి ముంగీస వచ్చింది.
వచ్చి రాగానే పామునే టార్గెట్ చేసుకొని ఏకంగా చెట్టు ఎక్కింది.అలజడికి లేచిన పాము ఉలిక్కి పడింది.
అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.ముంగీస నోట్లో పాము తల ఇరుక్కు పోయింది.
పాముకి తలే కీలకం కావడం వలన అది చేసేదేమిలేక చతికల పడింది.మాములుగా ముంగీసలకు పాముల్ని చంపే శక్తి ఉంటుంది.
అందువలన పాము కాటేస్తున్నా ముంగీస వెనక్కి మాత్రం తగ్గదు.ఎందుకో తెలుసా.
పాములు కాటేసినా… ముంగీసలకు ఏమీ కాదు.ఎందుకంటే.
ముంగీసల్లో ఎసెటీఖోలైన్ రిసెప్టర్స్ ఉంటాయి కనుక.