ప్రజల మీద అత్యంత ప్రభావం చూపే రంగాలలో ఒక్కటైన సినీరంగం లోని ప్రముఖులు ఏది చేసినా అది వెంటనే వైరల్ అయిపోతుంది.అందుకే అలాంటి సినీ రంగంలో రాణించే హీరోలు,హీరోయిన్స్ మిగతా సాంకేతిక నిపుణులు తమ విషయాలను చాలా సీక్రెట్ గా ఉంచుతారు.
మరి ప్రజలపై అంత ప్రభావం చూపే సినిమా వాళ్ళలో కొందరు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు.ఇందులో ఎక్కువగా బాలీవుడ్ స్టార్స్ ఉండడమే గమనార్హం.
ఇక తాజాగా తన చిత్ర షూటింగ్ కోసం టర్కీ వెళ్ళిన అమీర్ ఖాన్ అక్కడ అధ్యక్షుడు భార్యను కలిశారు.ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ టర్కీను మత రాజ్యంగా ప్రకటించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.ప్రపంచంలో ఉన్న ముస్లిం దేశాలన్నింటికీ తానే పెద్ద కావాలని కలలు కంటున్నాడు.
అందుకే ఎర్డోగాన్ పాకిస్తాన్ తో చేతులు కలిపి ప్రపంచంలో రెండవ అతిపెద్ద ముస్లిం జనాభా కలిగి ఉన్న మన దేశాన్ని పని పాట లేకుండా అస్తమానం విమర్శిస్తున్నారు.మరి అలాంటి దేశ అధ్యక్షుడు భార్యను ఇండియన్ ఫిల్మ్ స్టార్ గా కొనసాగుతున్న అమీర్ ఖాన్ ఎలా కలుస్తారు.
ఆయనకు కొంచెం అయిన బాధ్యత ఉండాలిగా అంటూ అమీర్ ఖాన్ ను సోషల్ మీడియా ద్వారా ఆయన అభిమానులే విమర్శిస్తున్నారు.