భారత సంతతికి చెందిన రీసెర్చర్ సర్మిస్త సేన్ గత వారం దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే.పార్క్‌లో జాగింగ్‌కు వెళ్లిన ఆమె శవమై తేలారు.
ఎంతో చలాకీగా, ఇరుగుపొరుగు వారితో కలివిడిగా ఉండే సర్మిస్త మరణాన్ని స్థానిక భారతీయ సమాజంతో పాటు అమెరికన్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో టెక్సాస్ రాష్ట్రంలోని ప్లాన్ నగరంలో శనివారం తెల్లవారుజామున వేలాది మంది ప్రజలు సర్మిస్త జ్ఞాపకార్థం మారథాన్‌లో పాల్గొన్నారు.
అనంతరం ఆమె హత్యకు గురైన చిషోల్మ్ ట్రైల్ పార్క్ వద్ద సమావేశమై నివాళులర్పించారు.మధ్యాహ్నం తర్వాత, వేలాది మంది ప్రజలు సర్మిస్త సేన్ కుటుంబాన్ని పరామర్శించారు.మరోవైపు సర్మిస్త సేన్ భర్త GoFundMe pageలో కేరింగ్ బ్రిడ్జ్ పేజ్‌ను ఏర్పాటు చేశారు.అలాగే ఆమె జీవిత చరిత్రను, సాధించిన విజయాలను అందులో పొందుపరిచారు.
ఈ పేజ్ ద్వారా వచ్చిన విరాళాలను క్యాన్సర్‌పై అవగాహన, క్యాన్సర్‌పై పరిశోధన, ఆరోగ్యకరమైన జీవనం, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాల్లో కృషి చేస్తున్న సంస్థలకు , వ్యక్తులకు విరాళంగా ఇస్తానని ఆయన తెలిపారు.

కాగా 43 ఏళ్ల సర్మిస్త సేన్ మాలిక్యూలర్ బయాలజీ విభాగంలో, క్యాన్సర్ రోగుల కోసం పనిచేసేవారు.ఆగస్టు 1న చిషోల్మర్ ట్రైల్ పార్క్‌లో జాగింగ్ చేస్తుండగా సర్మిస్త హత్యకు గురయ్యారు.ఆమె మృతదేహం లెగసీ డ్రైవ్, మార్చమన్ క్రీక్ ప్రాంతంలో లభ్యమైంది.
హత్యకు సంబంధించి 28 ఏళ్ల బకారి అభియోనా మోన్‌క్రీవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.