పసికూన దెబ్బకు ప్రపంచ ఛాంపియన్స్ విలవిల...!

గత సంవత్సరం ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్ లో విజేతగా నిలిచిన ఇంగ్లాండ్ జట్టుకు క్రికెట్ లో పసికూన ఐర్లాండ్ దేశం షాకిచ్చింది.ఐర్లాండ్ ను లైట్ గా తీసుకున్న ఇంగ్లీష్ టీం కు ఆ జట్టు భారీ ఝలక్ ఇచ్చింది.329 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా మరో బంతి మిగిలి ఉండగానే ఇంగ్లాండ్ జట్టుపై ఐర్లాండ్ విజయం సాధించింది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే….

 Ireland, England, Century, Andrew Balbirnie, Ireland's Andrew Balbirnie, Paul St-TeluguStop.com

మొదట టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఐర్లాండ్ జట్టు మొదట్లో ఇంగ్లాండ్ పై ఆధిపత్యాన్ని చూపిస్తూ వచ్చింది.క్రమంగా వికెట్లను తీస్తూ ప్రత్యర్థి జట్టును కట్టడి చేయగలిగింది.

అయితే ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ కేవలం 84 బంతుల్లో 15 ఫోర్లు, నాలుగు సిక్సర్ల సహాయంతో 106 పరుగులు సాధించాడు.ఆ తర్వాత టామ్ బార్టన్ 51 బంతుల్లో 58 పరుగులు, విల్లీ 42 బంతుల్లో 51 పరుగులు చేయడంతో ఇంగ్లాండ్ జట్టు ఒక బంతి మిగిలివుండగానే 328 పరుగులకు ఆలౌట్ అయింది.

అయితే లక్ష్యం పెద్దగా ఉన్న ఐర్లాండ్ జట్టు ఎక్కడ తడబడకుండా క్రమంగా పరుగుల వేగాన్ని పెంచుతూ విజయం వైపు దూసుకెళ్లింది.ఈ నేపథ్యంలో ఐర్లాండ్ బ్యాట్స్ మెన్ పాల్ స్టిర్లింగ్ 128 బంతుల్లో 9 ఫోర్లు, ఆరు సిక్సర్లతో 142 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్రను పోషించాడు.

ఈయన తోపాటు ఐర్లాండ్ కెప్టెన్ ఆండ్రూ 112 బంతుల్లో 113 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చారు.ఏదేమైనా విశ్వ విజేత ఇంగ్లాండ్ జట్టును పసికూన ఓడించడం నిజంగా గొప్ప విషయమే.

మొత్తం మూడు మ్యాచ్ సిరీస్ లో ఇంగ్లాండ్ రెండు విజయాలు సాధించడంతో సిరీస్ ఇంగ్లాండ్ జట్టు వశమైంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube