ఎంత ఎదిగినా పుట్టిన ఊరిని మన మూలాలను మర్చిపోవద్దు అని చెబుతూ ఉంటారు పెద్దలు.ఈ మధ్య కాలంలో చాలా నాయకులు అధికారులు ఎంత ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ.
మూలాలను మర్చిపోకుండా ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.తాజాగా వైసీపీ ఎంపీ కూడా అలాంటిదే చేసారు.
తన తండ్రి గుడి దేవుడు ద్వారా సంక్రమించిన పొలంలో వ్యవసాయ పనులు చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది.
వైస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అరకు ఎంపీ గొడ్డేటి మాధవి తన తండ్రి మాజీ ఎమ్మెల్యే గుడి దేవుడు ద్వారా సంక్రమించిన పొలంలో దుక్కి దున్నుతూ.
వ్యవసాయ పనుల్లో నిమగ్నమైంది.చిన్నప్పటినుంచి వ్యవసాయ పనులు చేయడం సామాజిక కార్యక్రమాలు చేపట్టడం అలవర్చుకున్న గొడ్డేటి మాధవి… ప్రస్తుతం ఎంపీ హోదాలో కొనసాగుతున్నప్పటికీ తన మూలాలను మరిచి పోలేదు.
పార్లమెంటు సభ్యురాలిగా… ప్రజా ప్రతినిధిగా నియోజకవర్గ బాధ్యతలు చూస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూనే.మరోవైపు ఒక సాదా సీదా రైతుబిడ్డగా పొలం పనులు చేస్తూ తన నిరాడంబరత చాటుతుంది వైసీపీ ఎంపీ గొడ్డేటి మాధవి.
ప్రస్తుతం వైసీపీ ఎంపీ గొడ్డేటి మాధవి పొలం పనుల్లో నిమగ్నమైన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.మీరు ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నారు మేడం అంటూ నెటిజన్లు గొడ్డేటి మాధవి పై ప్రశంసలు కురిపిస్తున్నారు.