టాలీవుడ్ ప్రముఖ నటుడు మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపుగా మూడు సంవత్సరాల గ్యాప్ తర్వాత ప్రముఖ దర్శకుడు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న వకీల్ సాబ్ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీకి మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.కాగా ఈ చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నివేదా థామస్ నటిస్తోంది.
ఈ చిత్రం బాలీవుడ్ లో మంచి విజయం సాధించినటువంటి పింక్ చిత్రానికి రీమేక్ గా ఉంది.అయితే ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన దాదాపుగా చిత్రీకరణ పూర్తయినప్పటికీ ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నటించే హీరోయిన్ విషయంలో మాత్రం ఇప్పటికీ సస్పెన్స్ నెలకొంది.
కాగా తాజాగా ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నటించే హీరోయిన్ విషయమై టాలీవుడ్ బ్యూటీ క్వీన్ శృతి హాసన్ పేరు సోషల్ మీడియా మాధ్యమాలలో ఎక్కువగా వినిపిస్తోంది.కాగా ఈమ ధ్య శృతిహాసన్ కూడా సోషల్ మీడియాలో తన అభిమానులతో ముచ్చటిస్తున్న సమయంలో ఓ నెటిజన్ మీరు పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న వకీల్ సాబ్ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నట్లు పలు వార్తలు వినిపిస్తున్నాయి, నిజమేనా.? అని అడిగాడు.దీంతో తో శృతి హాసన్ ఈ విషయంపై స్పందిస్తూ తాను ఇప్పుడప్పుడే ఈ చిత్రం గురించి క్లారిటీ ఇవ్వలేనని చెప్పుకొచ్చింది.
దీంతో కొందరు నెటిజనులు ఈ విషయాన్ని సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ ట్రోల్స్ చేస్తున్నారు.
అయితే ఇంతకీ శృతి హాసన్ చెప్పిన విషయాన్ని బట్టి కొంతమంది అభిమానులు వకీల్ సాబ్ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నటిస్తోందా లేదా అంటూ చిత్ర యూనిట్ సభ్యులకి ప్రశ్నల వర్షం కనిపిస్తున్నారు.
కాబట్టి ఇప్పటికైనా వకీల్ సాబ్ చిత్ర యూనిట్ సభ్యులు స్పందించి ఈ చిత్రంలో హీరోయిన్ విషయంలో ఓ క్లారిటీ ఇస్తే బాగుంటుందని కొందరు అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.