కరోనా మహమ్మారి వల్ల విద్యావ్యవస్థ చిందరవందర అవుతోంది.పరీక్షల నిర్వాహణ సాధ్యం కావడం లేదు.
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పదవ తరగతి పరీక్షలు నిర్వహించలేదు.తెలంగాణలో ప్రారంభం అయిన మూడు రోజులకే వాయిదా వేయగా, ఏపీలో అసలు ప్రారంభించలేదు.
దాంతో మళ్లీ ఆ పరీక్షలను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరీక్షల నిర్వహణకు అనుమతించాలంటూ హైకోర్టుకు వెళ్లింది.
విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఒక నిర్ణయాన్ని వెంటనే తీసుకోవాలంటూ కోరడం జరిగింది.కోర్టు ఓకే అంటే జూన్ నెలలో ఎన్నికలను నిర్వహించాలని భావిస్తున్నట్లుగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
మరో వైపు ఏపీ ప్రభుత్వం పదవ తరగతి పరీక్ష విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది.గత ఏడాది వరకు పదవ తరగతికి 11 పేపర్లు ఉండేవి.కాని ఈ ఏడాది కేవలం ఆరు పేపర్లతోనే ముగించేయాలని భావిస్తున్నారు.11 పేపర్లను ఆరు పేపర్లకు కుదించాలని చాలా కాలంగా భావిస్తున్నారు.అయితే ఈసారి కరోనా కారణంగా ఎక్కువ రోజులు పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాని నేపథ్యంలో పేపర్లను కుదించాలనే నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.జులై మొదటి రెండవ వారంలో ఈ పరీక్షలు నిర్వహించబోతున్నట్లుగా ఏపీ విద్యా శాఖ ప్రకటించింది.
అప్పటి వరకు కరోనా విజృంభన తక్కువ ఉంటే పరీక్షలు జరుగవచ్చు.