మెగాస్టార్ చిరంజీవి సైరా చిత్రం తరువాత తన 152వ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమా టైటిల్ ‘ఆచార్య’ అని చిరు లీక్ చేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.
కాగా ఈ సినిమా పూర్తి కాకముందే చిరు తన నెక్ట్స్ చిత్రాలను కూడా లైన్‌లో పెట్టేందుకు రెడీ అయ్యాడు.ఈ క్రమంలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసిఫర్’ రీమేక్ రైట్స్‌ను సొంతం చేసుకున్నాడు.
ఈ సినిమాను తెలుగులో చిరు హీరోగా తెరకెక్కనుంది.ఇక ఈ సినిమాను డైరెక్ట్ చేసేందుకు సాహో డైరెక్టర్ సుజీత్‌ను ఫిక్స్ చేశారు.అయితే ఒరిజినల్ కథను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్చాలని చిరు సుజీత్‌కు చెప్పడంతో అదే పనిలో బిజీగా ఉన్నాడట ఈ కుర్ర డైరెక్టర్.ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా ఇతర పనులు ఏమీ లేకపోవడంతో సుజీత్ లూసిఫర్ కథను తెలుగు ప్రేక్షకులు మెచ్చే విధంగా తీర్చిదిద్దాడట.
తాజాగా ఈ కథలోని మార్పులు చేర్పులు పూర్తయ్యాయని, లాక్‌డౌన్ ముగియగానే మెగాస్టార్‌కు కథను వినిపించేందుకు సుజీత్ రెడీ అయ్యాడు.
కాగా సుజీత్ తెరకెక్కించిన భారీ బడ్జెట్ మూవీ ‘సాహో’ భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది.
దీంతో చిరు కోసం ఈ డైరెక్టర్ ఎలాంటి కథను రెడీ చేశాడా అనే సందేహం అందరిలో మొదలైంది.చిరు ఈ డైరెక్టర్‌ను ఎందుకు అంతలా నమ్ముతున్నాడా అని మెగా ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.
మరి సుజీత్ చిరును ఎలా చూపిస్తాడో చూడాలి అంటున్నారు సినీ విశ్లేషకులు.