అమెరికాలో కరోనా కోరల్లో చిక్కుకుని తమ సొంత దేశాలకి వెళ్ళిపోవాలని ఆరాటపడుతున్న భారతీయులకి కేంద్రం భరోసా ఇచ్చిన విధంగా వారి వారి సొంత ప్రాంతాలకి తరలించే ఏర్పాట్లు చేసింది.అమెరికాలో ఎంతో మంది భారతీయులు కరోన ధాటికి చనిపోయారు.
మరికొందరు మృత్యువుతో పోరాటం చేస్తున్నారు.బ్రతికుంటే బలుసాకు తినచ్చు.
ఇక్కడ మాకు దిక్కు మొక్కు లేదంటూ మేము ఇండియా వచ్చేస్తామని అభ్యర్ధన పెట్టుకున్న లక్షలాది మంది భారతీయులని దశల వారీగా ఇండియా తీసుకువస్తోంది భారత ప్రభుత్వం.
ఈ క్రమంలోనే అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఇండియాకి మొదటి విమానం వెళ్లనుందని ఇవి మొత్తం వివిధ ప్రాంతాలకి వెళ్లనున్నాయని తెలిపారు.
వీటిని ఎయిర్ ఇండియా నడుపుతుందని దౌత్య వేత్త తరణ్ జిత్ సింగ్ తెలిపారు.మొదటి వారంలో సుమారు 25 వేల మంది భారతీయులు ఇండియాకి వెళ్లేందుకు పేర్లు నమోదు చేసుకున్నారని ఆయన తెలిపారు.
ఇదిలాఉంటే రిజిష్టర్ చేసుకున్న వారికి తగ్గట్టుగా వారు కోరుకున్న విధంగా విభిన్న ప్రాంతాలకి ఈ విమానాలు వెళ్తాయని ప్రకటించారు.

వందే భారత్ మిషన్ లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టుగా ఆయన తెలిపారు.కరోనా అమెరికాలో మొదలై అమెరికన్స్ పిట్టల్లా రాలిపోతున్న తరుణంలో భారత్ తమకి ఎంతో భద్రతని ఇస్తుందని భావించిన ఇండియన్స్ మళ్ళీ తమ సొంత ప్రాంతాలకి వెళ్లాలని అమెరికాలో పరిస్థితులు కుదుటపడిన తరువాత మళ్ళీ అమెరికా వెళ్ళాలని భావిస్తున్నారు.ఇదిలాఉంటే ఎంతో మంది ఎన్నారైలు ఇండియాలో ఉండిపోవడానికి డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది.