గెస్ట్‌హౌస్‌లో మహిళా అతిథులపై రేప్: భారతీయుడికి మూడున్నరేళ్ల జైలు శిక్ష

గెస్ట్‌హౌస్‌లో అతిథులను జాగ్రత్తగా చూసుకోవాల్సింది పోయి వారిపై అత్యాచారానికి పాల్పడిన భారతీయ కార్మికుడికి యూకే కోర్టు మూడు సంవత్సరాల ఎనిమిది నెలల జైలు శిక్ష విధించింది.

 John Guntypilli Suriyappan Andrew Stubbs-TeluguStop.com

లీడ్స్‌లోని అవలోన్ గెస్ట్‌హౌస్‌లో పనిచేసే 35 ఏళ్ల జాన్ గుంటిపిల్లి సౌరియప్పన్ గెస్ట్‌హౌస్‌లో తన భర్త నిద్రపోతున్న సమయంలో తనపై అత్యాచారానికి పాల్పడినట్లు బాధిత మహిళ ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గతేడాది డిసెంబర్‌లో అదే సాయంత్రం పార్టీ తర్వాత రూమ్‌కు తిరిగి వచ్చినప్పుడు తనపై నిందితుడు అఘాయిత్యానికి పాల్పడినట్లు మరో బాధితురాలు ఆరోపించింది.

Telugu Indian Guest, Sexual Assaults, Telugu Nri Ups-

లైంగిక దాడి సమయంలో సౌరియప్పన్ గెస్ట్‌హౌస్ ప్రాంగణంలోని సీసీటీవీ కెమెరాలను స్విచ్ ఆఫ్ చేసి, ఆధారాలు దొరక్కుండా చేశాడని విచారణ సందర్భంగా లీడ్స్ క్రౌన్ కోర్టుకు ప్రాసిక్యూషన్ తెలిపింది.సీసీటీవీ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి కీలను ఉపయోగించడంతో పాటు.దొంగచాటుగా అతిథుల గదుల్లోకి ప్రవేశించి, అత్యాచారానికి పాల్పడటం క్షమించరాని నేరమిన న్యాయమూర్తి ఆండ్రూ స్టబ్స్ వ్యాఖ్యానించారు.

అతిగా మద్యం సేవించడం, భార్యతో మనస్పర్థల కారణంగా అతను ఈ నేరానికి పాల్పడినట్లు సౌరియప్పన్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube