గెస్ట్‌హౌస్‌లో మహిళా అతిథులపై రేప్: భారతీయుడికి మూడున్నరేళ్ల జైలు శిక్ష
TeluguStop.com
గెస్ట్‌హౌస్‌లో అతిథులను జాగ్రత్తగా చూసుకోవాల్సింది పోయి వారిపై అత్యాచారానికి పాల్పడిన భారతీయ కార్మికుడికి యూకే కోర్టు మూడు సంవత్సరాల ఎనిమిది నెలల జైలు శిక్ష విధించింది.
లీడ్స్‌లోని అవలోన్ గెస్ట్‌హౌస్‌లో పనిచేసే 35 ఏళ్ల జాన్ గుంటిపిల్లి సౌరియప్పన్ గెస్ట్‌హౌస్‌లో తన భర్త నిద్రపోతున్న సమయంలో తనపై అత్యాచారానికి పాల్పడినట్లు బాధిత మహిళ ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గతేడాది డిసెంబర్‌లో అదే సాయంత్రం పార్టీ తర్వాత రూమ్‌కు తిరిగి వచ్చినప్పుడు తనపై నిందితుడు అఘాయిత్యానికి పాల్పడినట్లు మరో బాధితురాలు ఆరోపించింది.
""img Src="https://telugustop!--com/wp-content/uploads/2020/01/Indian-Guest-House-Worker-On-Women-In-UK-మహిళా-అతిథులపై-!--jpg"/లైంగిక దాడి సమయంలో సౌరియప్పన్ గెస్ట్‌హౌస్ ప్రాంగణంలోని సీసీటీవీ కెమెరాలను స్విచ్ ఆఫ్ చేసి, ఆధారాలు దొరక్కుండా చేశాడని విచారణ సందర్భంగా లీడ్స్ క్రౌన్ కోర్టుకు ప్రాసిక్యూషన్ తెలిపింది.
సీసీటీవీ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి కీలను ఉపయోగించడంతో పాటు.దొంగచాటుగా అతిథుల గదుల్లోకి ప్రవేశించి, అత్యాచారానికి పాల్పడటం క్షమించరాని నేరమిన న్యాయమూర్తి ఆండ్రూ స్టబ్స్ వ్యాఖ్యానించారు.
అతిగా మద్యం సేవించడం, భార్యతో మనస్పర్థల కారణంగా అతను ఈ నేరానికి పాల్పడినట్లు సౌరియప్పన్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
అస్థిపంజరంలాంటి వింత జీవి.. ఫొటోలు చూస్తే నిద్ర పట్టదు.. బ్రిటన్‌లో హాట్ టాపిక్?