తానూ ఇచ్చిన మాటని నిలబెట్టుకుని అమెరికా ప్రజలముందు ఇచ్చిన మాట తప్పని నేతగా ఉండాలని భావిస్తున్న ట్రంప్ మెక్సికో సరిహద్దు గోడ విషయంలో రాజీకి వచ్చేలా కనిపించడం లేదు.షట్ డౌన్ దాదాపు నెలరోజుల పైనే జరిగినా సరే ట్రంప్ వేచి చూశాడు తప్ప అడుగు వెనక్కి వేయలేదు.
చివరికి డెమోక్రాట్లు గోడ నిర్మాణానికి సహకరించక పోవడంతో.ఇప్పుడు ఎమర్జెన్సీ దిశగా అడుగులు వేస్తున్నాడు.
సరిహద్దు బిల్లు పై సంతకం చేసినా సరే సరిహద్దు గోడ నిధుల కోసం తన అధికారాన్ని దుర్వినియోగం చేశాడని డెమోక్రాట్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.కోర్టుకు కూడా వెళ్తామని హెచ్చరికలు కూడా చేశారు.అమెరికన్ కాంగ్రెస్ కూడా గోడ నిర్మాణానికి సానుకూలంగా లేదు.ట్రంప్ డిమాండ్‌ను ఒప్పుకోలేదని ఇప్పుడు ఎమర్జెన్సీ దిశగా అడుగులు వేస్తున్నాడు.
ఒక వేళ ఎమర్జెన్సీ విధిస్తే అమెరికన్ కాంగ్రెస్ తో పని ఉండదు.అంటే కాంగ్రెస్ అధికారాలు ఎమర్జెన్సీ ముందు చెల్లుబాటు కావు.
దాంతో ట్రంప్ గోడ నిర్మాణానికి కావాల్సిన నిధులు తన ఒక్క సంతకంతో పొందవచ్చు.అయితే ఈ విషయంపై వైట్ హౌస్ ప్రతినిధి సారా శాండర్స్ సూతనప్రాయ ప్రకటన చేశారు కూడా.