ఏపీలో 2019 ఎన్నికలు పార్టీల అధినేతల్లో బీపీ ని పెంచుతున్నాయి.ఈ ఎన్నికలలో మూడు పార్టీల త్రుముఖ పోరు.
పార్టీనేతలని మరింత కలవర పెడుతోంది.అయితే ఎవరి సామాజిక వర్గాల బలాబలాలు వారికి మెండుగా ఉన్నాయి.
ఎవరి ఓటు బ్యాంక్ వారికి బలంగా ఉంది కూడా అయితే ఈ క్రమంలోనే అందరి చూపు పవన్ కళ్యాణ్ వైపుకు మళ్ళింది.ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడంలో దిట్ట అయిన చంద్రబాబు జగన్ లకి దిమ్మతిరిగేలా పవన్ కి ఊహించని రీతిలో సపోర్ట్ వస్తోంది.
ఇంతకీ ఆ సప్పోర్ట్ ఎవరిని నుంచీ వస్తోంది అంటే.
ముఖ్యంగా ప్రతీ ఎన్నికలకి యువత ఓట్లు అత్యంత కీలకం ఈ విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అయితే యువత ఓట్లు కొల్లగొట్టే పార్టీలకి విజయం దాదాపు ఖరారు అయినట్టే అనేది కూడా రాజకీయాల్లో అందరికీ తెలిసిందే.అయితే వచ్చే ఎన్నికల్లో ఎవరు ఎవరితో పొత్తులు పెట్టుకున్నా పెట్టుకోక పోయినా సరే యువత ఓట్లు మొత్తం భారీ స్థాయిలో పవన్ కి పడిపోవడం ఖాయం అంటున్నారు.అదేంటి అన్ని పార్టీల నేతల్లో సామాజిక వర్గాలలో యువత ఉన్నారు వారి వారి సామాజిక వర్గాలకి ఓట్లు వేసుకుంటారు కదా అనే కొందరు పండితుల ప్రశ్నలకి దిమ్మతిరిగే ఆన్సర్ ఇస్తున్నారట ఏపీ యువత.అదేంటంటే
తమకి ఓటు హక్కు వచ్చిన నాటినుంచీ ఎదో ఒక పార్టీకి ఓటు వేయాలి కాబట్టి ఓటు వేయకపోవడం తప్పు కాబట్టి వేస్తూ వచ్చాము గత ఎన్నికల్లోనే పవన్ కళ్యాణ్ పార్టీ పోటీలో నిలబడితే కులాలకి అతీతంగా ఓటు వేసి తమ సత్తా చాటే వాళ్ళం అయితే పవన్ కళ్యాణ్ చంద్రబాబు కి ఓటు వేయండి అని చెప్పడంతోనే గత ఎన్నికల్లో టీడీపీ కి ఓటు వేశాము తప్ప కుల ఓటింగ్ మాత్రం కాదు అని తెలిపారట.అయితే ఈ సారి పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనడంతో తప్పకుండా యువత ఓటు పవన్ కే పడుతుందని ఘంటాపథంగా చెప్తున్నారు.
ఏపీలో ఉన్న తెలుగుదేశం ,వైసీపీ పార్టీలతో పోల్చి చూస్తే పవన్ కళ్యాణ్ జనసేన చాలా క్లీన్ గా ఉందని.ఎటువంటి రిమార్క్ లేని వ్యక్తిగా ప్రజల కోసం ఏదన్నా చేయగలిగే చెగువేరా గా పవన్ ని మేము అభిమానిస్తామని చెప్తున్నారు యువకులు.అంతేకాదు ఒక సినిమా నటుడిగా కూడా పవన్ కళ్యాణ్ అంటే మాకు ఎంతో అభిమానమని పవన్ గెలుపు కోసం మేము తప్పకుండా కష్టపడుతామని నొక్కి మరీ చెప్తున్నారు.మహిళా యువత కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.
మరి పవన్ యువతకి తనపై ఉన్న ఈ ఎన్నికల వరకూ కాపాడుకుంటే మంచిదనేది విశ్లేషకుల భావన.